కొజికోడ్: నీటిలో కొట్టుకుపోతున్నవాడికి తాడు దొరికినట్లయ్యింది కేరళలో ఓ వ్యక్తికి. పీకల్లోతు అప్పులో కూరుకుపోయిన వ్యక్తి ఇల్లు అమ్మకానికి పెట్టాడు. వేలానికి కొన్ని గంటల ముందు.. అదృష్టం అతడి తలుపు తట్టింది. ఏకంగా కోటి రూపాయల బంపర్ లాటరీ తగిలింది. కొజికోడ్కు చెందిన మహమ్మద్ బావా(50) వృత్తిరీత్యా పెయింటర్.
అప్పుచేసి ఇల్లు కట్టుకున్నాడు. పెద్దకొడుకును గల్ఫ్ పంపేందుకు మరికొంత అప్పుచేశాడు. దానికితోడు 9 మంది సంతానం. రూ.50లక్షల అప్పు తీర్చేందుకు గత్యంతరంలేనిస్థితిలో ఇంటిని అమ్మకానికి పెట్టాడు. కానీ ఆఖరి నిమిషంలో అదృష్టం వరించింది.