భోపాల్: భార్య ముందు ‘అంకుల్’ అని పిలువడంపై ఒక వ్యక్తి ఆగ్రహించాడు. అతడితో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత కొందరితో కలిసి ఆ షాప్ వద్దకు వచ్చాడు. తన అనుచరులతో కలిసి షాప్ యాజమానిని తీవ్రంగా కొట్టాడు. (Man thrashes shopkeeper) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. జాత్ఖేడి ప్రాంతంలో విశాల్ శాస్త్రికి చీరల షాపు ఉంది. శనివారం రోహిత్ తన భార్యతో కలిసి ఆ షాప్ లోకి వచ్చాడు. ఈ జంట పలు చీరలను చూసింది. అయితే కొనుగోలు చేసేందుకు ఏ చీరను ఎంచుకోలేదు.
కాగా, ఏ రేటులో చీర కావాలి అని విశాల్ అడిగాడు. వెయ్యి అని రోహిత్ సమాధానమిచ్చాడు. అయితే అంతకంటే ఖరీదైన చీర కూడా కొంటానని చెప్పాడు. తన కొనుగోలు సామర్థ్యాన్ని తక్కువగా భావించి మాట్లాడవద్దని హెచ్చరించాడు. దీంతో ‘అంకుల్’ మీకు ఆ రేంజ్లో చీరలు చూపిస్తాను’ అని విశాల్ అన్నాడు. దీనికి ఆగ్రహించిన రోహిత్ తనను ‘అంకుల్’ అని పిలువ వద్దంటూ వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత భార్యతో కలిసి ఆ షాపు నుంచి వెళ్లిపోయాడు.
మరోవైపు కొంత సేపటి తర్వాత కొంత మందితో కలిసి ఆ చీరల షాపు వద్దకు రోహిత్ వచ్చాడు. వారంతా కలిసి విశాల్‌ను షాప్ నుంచి రోడ్డు వద్దకు లాక్కెళ్లి కొట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే గాయపడిన విశాల్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో రోహిత్, మరి కొందరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఆ షాపు వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
भोपाल में दुकानदार ने ग्राहक को अंकल कहा तो वह आगबबूला हो गया। इसके बाद ग्राहक ने कई लड़कों के साथ वापस आकर दुकानदार की पिटाई कर दी। pic.twitter.com/BED7qmdJ9C
— Shabnaz Khanam (@ShabnazKhanam) November 3, 2024
MP अजब है …सबसे गजब है…राजधानी भोपाल में एक दुकानदार को परिवार सहित शॉपिंग करने आए ग्राहक को अंकल बोलना भारी पड़ गया…ग्राहक ने दुकानदार की जमकर पिटाई लगा दी !! pic.twitter.com/1r1VHWno22
— Izhar Hasan Khan (@izharihk) November 3, 2024