Man Rapes Daughter For 4 Years | నాలుగేళ్లుగా కూతురుపై తండ్రి అత్యాచారం.. నిందితుడి కోసం వెతుకుతున్న పోలీసులు
Man Rapes Daughter For 4 Years | కూతురుపై తండ్రి నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి తన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి పరారైన ఆ వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భోపాల్: కూతురుపై తండ్రి నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. (Man Rapes Daughter For 4 Years ) దీంతో ఆ యువతి తన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఇంటి నుంచి పరారైన ఆ వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లవకుష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి తన కుమార్తెపై నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. విసిగిపోయిన 21 ఏళ్ల యువతి తన తల్లితో కలిసి గురువారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసిన ఆమె తండ్రి ఇంటి నుంచి పారిపోయాడు.
కాగా, బాధిత యువతి ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. భారతీయ న్యాయ సంహిత (బీఎస్ఎస్) చట్టం కింద ఆ వ్యక్తిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. అలాగే 18 ఏళ్ల లోపు నుంచే తండ్రి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు కుమార్తె ఆరోపించింది. ఈ నేపథ్యంలో లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కూడా పోలీసులు అభియోగాలు మోపారు. పరారైన నిందితుడి కోసం వెతుకుతున్నారు. అతడ్ని అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- 4 years
- Daughter
- Madhya Pradesh
- MAN
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

