కోతి దాహం తీర్చిన వ్యక్తి.. వీడియో వైరల్

న్యూఢిల్లీ: ఎండాకాలం కావడంతో తాగునీటి కోసం మూగ జీవాలు అల్లాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బాగా దాహంతో ఉన్న కోతికి ఒక వ్యక్తి దాహార్తి తీర్చాడు. తన వాటర్ బాటిల్లోని నీటిని స్వయంగా తాగించాడు. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్లో శనివారం పోస్ట్ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇందులో ఒక టూరిస్ట్ ఒక కోతికి తన వాటర్ బాటిల్లోని నీటిని తాగిస్తాడు. ఇంతలో మరో కోతి అక్కడకు వచ్చి ఆ బాటిల్‌ను లాక్కోబోతుంది. అయితే వారించిన అతడు దానికి కూడా నీటిని తాగిస్తాడు. మరోవైపు మంచినీటిని తాగించిన ఆ వ్యక్తి చెంతకు మొదటి కోతి చేరి ఆప్యాయత చూపుతుంది. మీరు ప్రపంచంలో ఎలా ఉన్నప్పటికీ.. దయ కలిగి ఉండండి.. అని సుశాంత నందా ఈ వీడియోకు శీర్షిక పెట్టారు.
మరోవైపు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. మండుటెండలో కోతి దాహం తీర్చిన ఆ వ్యక్తిని కొందరు కొనియాడారు. దయాగుణం శక్తికి ఇది నిదర్శనమని ఒకరు వ్యాఖ్యానించారు.
In a world where you can be anything, be kind 💕 pic.twitter.com/47preqtT9c
— Susanta Nanda IFS (Retd) (@susantananda3) April 17, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

