man kills girlfriend | పెళ్లి కోసం ప్రియురాలు బలవంతం.. పెళ్లి రోజున హత్య చేసిన ప్రియుడు
man kills girlfriend | పెళ్లి కోసం బలవంతం చేసిన ప్రియురాలిని, పెళ్లి చేసుకోవాల్సిన రోజునే ప్రియుడు హత్య చేశాడు (man kills girlfriend) . మాట్లాడాలని చెప్పి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె గొంతు నొక్కి హత్య చేశాడు.
లక్నో: పెళ్లి కోసం బలవంతం చేసిన ప్రియురాలిని, పెళ్లి చేసుకోవాల్సిన రోజునే ప్రియుడు హత్య చేశాడు (man kills girlfriend) . ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. రాహుల్, కోమల్ మధ్య ఏర్పడిన పరిచయం వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలంటూ రాహుల్‌ను కోమల్ బలవంతం చేసింది. ఆమె పోరుపడలేక పెళ్లి చేసుకునేందుకు రాహుల్ ఒప్పకున్నాడు. అయితే వారిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించిన రోజునే ఆమెను అంతం చేయాలని ప్లాన్ వేశాడు. మాట్లాడాలని చెప్పి కోమల్‌ను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె గొంతు నొక్కి రాహుల్ హత్య చేశాడు. అనంతరం మొబైల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి తన ఇంటికి వెళ్లిపోయాడు.
కాగా, కుమార్తె కోమల్ కనిపించకపోవడంతో ఆమె తండ్రి సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. రాహుల్, కోమల్ చివరిసారి అటవీ ప్రాంతంలో కలుసుకున్నట్లు వారి మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. దీంతో రాహుల్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే తమ పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని అతడు తెలిపాడు. మరోవైపు పెళ్లి కోసం తీవ్ర ఒత్తిడి చేయడంతో కోమల్‌ను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో కోమల్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రాహుల్‌ను అరెస్ట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- girlfriend
- Kills
- Lucknow
- MAN
RELATED ARTICLES
తాజా వార్తలు
Trisha | జయలలిత పాత్రలో త్రిష.. ఎంజీఆర్ బయోపిక్‌లో కీలక పాత్రకు ఓకే చెప్పిందా!
Glacial Lake Outburst | భూటాన్‌లో హిమానీనదం విస్ఫోటనం.. బెంగాల్, అస్సాంలకు వరద ముప్పు.. కేంద్రం హైఅలర్ట్..!
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ.. వెంకీ కామెడీకి ప్రశంసలు, త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?
Throat problem | గొంతులో నొప్పి, మంట, గరగర వేధిస్తున్నాయా.. అయితే ఈ వంటింటి చిట్కా మీ కోసమే..!
Vishwak Sen | ఫ్యాన్స్ మీట్ వివాదంపై మరోసారి స్పందించిన విశ్వక్ సేన్.. ఆ రోజు జరిగిన తప్పుకు క్షమాపణలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

