Sai Tirumalaneedi | న్యూఢిల్లీ: ఏపీకి చెందిన సాయి తిరుమలనీది అనే కుర్రాడు ప్రపంచంలోనే అతి చిన్న వాషింగ్ మెషీన్ తయారుచేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. గిన్నిస్ బుక్‌లోనూ స్థానం సంపాదించాడు. ఇతడి అసాధారణ ప్రయత్నాన్ని గిన్నిస్ బుక్ బుధవారం తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ప్రదర్శించింది.
ఈ యంత్రం పనితీరుపై పలువురు ఆసక్తి కనబరిచారు. 37మి.మీx41మి.మీx43మి.మీ కొలతలతో సాయి ఈ యంత్రాన్ని రూపొందించాడు’ అని గిన్నిస్‌బుక్ పేర్కొంది.