Man Forced To Drink Urine | వివాహిత మహిళతో పారిపోయిన వ్యక్తి.. మూత్రం తాగించడంతోపాటు, చెప్పులు నాకించారు
Man Forced To Drink Urine | వివాహిత మహిళతో కలిసి ఒక వ్యక్తి పారిపోయాడు. ఈ నేపథ్యంలో కొందరు ఆ వ్యక్తిని కొట్టడంతోపాటు బలవంతంగా మూత్రం తాగించారు. (Man Forced To Drink Urine) అలాగే చెప్పులు నాకించారు. ఆ మహిళతో కూడా చెప్పుతో కొట్టించారు.
భోపాల్: వివాహిత మహిళతో కలిసి ఒక వ్యక్తి పారిపోయాడు. ఈ నేపథ్యంలో కొందరు ఆ వ్యక్తిని కొట్టడంతోపాటు బలవంతంగా మూత్రం తాగించారు. (Man Forced To Drink Urine) అలాగే చెప్పులు నాకించారు. ఆ మహిళతో కూడా చెప్పుతో కొట్టించారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జాయినీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భట్పచ్లానా పోలీస్ స్టేషన్ పరిధిలోని భిల్ఖేడి గ్రామంలో బంజారా కమ్యూనిటీకి చెందిన వివాహిత మహిళతో కలిసి ఒక వ్యక్తి పారిపోయాడు.
కాగా, ఆ జంటను పట్టుకున్న ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి పట్ల దారుణంగా వ్యవహరించారు. అతడ్ని కొట్టడంతోపాటు మెడలో చెప్పుల దండ వేశారు. బాటిల్లో ఉన్న మూత్రాన్ని బలవంతంగా తాగించారు. ఆ మహిళతో అతడ్ని చెప్పుతో కొట్టించారు. చెప్పులు నాకించడంతోపాటు ఒక చెప్పు తలపై ఉంచాలని బలవంతం చేశారు. అలాగే అర గుండు కొట్టించడంతోపాటు మీసాన్ని సగం వరకు తీయించారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు స్పందించారు. మూడు, నాలుగు రోజుల కిందట ఈ సంఘటన జరిగినట్లు తెలిపారు. బాధిత వ్యక్తిని సంప్రదించినట్లు చెప్పారు. అయితే ఫిర్యాదు చేసేందుకు అతడు నిరాకరించినట్లు వెల్లడించారు. అయినప్పటికీ ఈ సంఘటనపై చట్టపరంగా చర్యలు చేపడతామని పోలీస్ అధికారి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

