Man Prayers Then Steals | పెట్రోల్ బంకు ఆఫీస్‌లోకి చొరబడిన దొంగ.. దేవుడ్ని ప్రార్థించి ఆపై చోరీ
Man Prayers Then Steals | పెట్రోల్ బంకు ఆఫీస్‌లోకి ఒక దొంగ చొరబడ్డాడు. అక్కడి పూజా ప్రదేశాన్ని చూసిన అతడు దేవుడికి ప్రార్థించారు. ఆ తర్వాత లక్షల్లో నగదు దొంగిలించి పారిపోయాడు. ఆ ఆఫీస్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
భోపాల్: పెట్రోల్ బంకు ఆఫీస్‌లోకి ఒక దొంగ చొరబడ్డాడు. అక్కడి పూజా ప్రదేశాన్ని చూసిన అతడు దేవుడికి ప్రార్థించారు. ఆ తర్వాత లక్షల్లో నగదు దొంగిలించి పారిపోయాడు. (Man Prayers Then Steals) ఆ ఆఫీస్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని మచల్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి సుజల్పూర్ హైవేపై సోయత్ కలాన్ వద్ద ఉన్న పెట్రోల్ బంకు ఆఫీస్‌లోకి ఒక వ్యక్తి చొరపడ్డాడు. లోపలున్న పూజా స్థలాన్ని చూసిన అతడు దేవుళ్ల ముందు ఒంగి ప్రార్థనచేశాడు. ఆ తర్వాత సీసీటీవీ కెమెరాను గమనించి దానిని ఆఫ్ చేసేందుకు ప్రయత్నించాడు. అనంతరం అక్కడ వెతికి రూ.1.57 లక్షలు చోరీ చేశాడు.
కాగా, ఆ దొంగ పారిపోతుండగా పెట్రోల్ బంకు వద్ద నిద్రించిన సిబ్బంది మేల్కొన్నారు. ఆ వ్యక్తిని పట్టుకునేందుకు వెంబడించినా ఫలితం లేకపోయింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలో ఇనుప రాడ్, చీరను గుర్తించారు. పెట్రోల్ బంకులోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. దొంగను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A burglar in #MadhyaPradesh‘s #Rajgarh district broke into a petrol pump’s office and stole nearly Rs 1.6 lakh.
CCTV footage shows the thief praying to a deity inside the office before ransacking the place and stealing the cash.
Read more 🔗https://t.co/ccIwjij2IU pic.twitter.com/bWoCj6p48B
— The Times Of India (@timesofindia) December 8, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

