Mamata Banerjee | బీజేపీ కక్షసాధింపు రాజకీయాలు : మహువ మొయిత్రపై వేటును ఖండించిన దీదీ
డబ్బు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలపై టీఎంసీ ఎంపీ మహువ మొయిత్రను లోక్‌సభ నుంచి బహిష్కరించడం పట్ల పశ్చిమ బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పందించారు.
కోల్‌కతా : డబ్బు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారనే ఆరోపణలపై టీఎంసీ ఎంపీ మహువ మొయిత్రను లోక్‌సభ నుంచి బహిష్కరించడం పట్ల పశ్చిమ బెంగాల్ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పందించారు. తమ పార్టీ సహచరి మహువ మొయిత్రపై వేటు వేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. బహిష్కృత ఎంపీకి పార్టీ బాసటగా నిలుస్తుందని భరోసా ఇచ్చిన దీదీ బీజేపీ కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
తమ పార్టీ ఎంపీని బహిష్కరించాలని ఎథిక్స్ కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం మహువ మొయిత్రకు సభలో మాట్లాడే అవకాశం కల్పించకపోవడం దారుణమని అన్నారు. వివరణ ఇచ్చేందుకు ఎంపీకి అవకాశం ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన తీరును తాను ఖండిస్తున్నానని పేర్కొన్నారు. పార్టీ ఆమెకు పూర్తిగా అండగా ఉంటుందని, ఆమెకు న్యాయం జరగాలని తాము కోరుకున్నా ప్రభుత్వం ఎలాంటి అవకాశం ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఇది బీజేపీ కక్షసాధింపు రాజకీయాలకు అద్దం పడుతోందని దీదీ పేర్కొన్నారు.
ఇది పార్లమెంట్ చరిత్రలో విషాదకర రోజని దీదీ అన్నారు. మొయిత్రను బహిష్కరిస్తూ లోక్‌సభ నిర్ణయం రాజ్యాంగ హక్కులకు తూట్లు పొడవడమేనని వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో తమకూ మూడింట రెండు వంతుల మెజారిటీ ఉందని, ఎవరినైనా తక్షణమే బహిష్కరించే అవకాశం ఉందని, కానీ తాము ఇలాగే చేయాలా అని ఆమె ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికలకు కేవలం రెండు, మూడు నెలల సమయం మాత్రమే ఉండగా ఇలాంటి ఘటన దురదృష్టకరమని, తాము అంగీకరించబోమని దీదీ స్పష్టం చేశారు.
Read More :
TSRTC | రేపట్నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. నిబంధనలు ఇవే..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రాహుల్‌గాంధీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మారింది : కేటీఆర్
Health Tips | ఇంట్లో నాఫ్తలీన్ బాల్స్ వాడుతున్నారా..? అయితే ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవాల్సిందే..!
Amitabh Bachchan | మరోసారి వైరల్ అవుతున్న అమితాబ్ బచ్చన్ డైట్.. ఇంతకీ ఆయన ఏం తీసుకుంటారు..?
judge’s Minor son drives Car hits scooter | లగ్జరీ కారు నడిపిన జడ్జి మైనర్ కుమారుడు.. స్కూటీని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
X Money | ఇక ఎక్స్ ద్వారా కూడా డబ్బులు పంపొచ్చు.. కొత్త ఫీచర్ ప్రకటించిన ఎలాన్ మస్క్..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

