సూపర్ మార్కెట్లలో వైన్ విక్రయాలు దురదృష్టకరం: అన్నా హజారే

ముంబై: సూపర్ మార్కెట్లలో వైన్ విక్రయాలకు అనుతించడంపై మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం ప్రజలను మద్యం మాన్పించే దిశగా పని చేయడం ప్రభుత్వ కర్తవ్యమని అన్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాల పేరుతో ప్రజలు మద్యానికి బానిసయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై తాను బాధపడినట్లు మీడియాతో సోమవారం అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మహారాష్ట్రతోపాటు, రాష్ట్ర ప్రజలకు చాలా దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.
వైన్ మద్యం కాదని, రైతులు ప్రయోజనం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోందని, అయితే ఈ నిర్ణయం ఎక్కడికి దారి తీస్తుందని అన్నా హజారే ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆసక్తి ఉంటే పేద, సాధారణ రైతులు ఏమి పండించాలన్నదానిపై గ్యారెంటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బహిరంగ మార్కెట్లో వైన్ విక్రయాల ద్వారా ఏడాదికి వెయ్యి కోట్ల లీటర్ల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, వాస్తవానికి ఏమి విస్మరిస్తోందో తెలుసా? అని మండిపడ్డారు.
మరోవైపు సూపర్ మార్కెట్లు, కిరాణా షాపుల్లో వైన్ విక్రయించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. శివనేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మహారాష్ట్రను మద్యపాన రాష్ట్రంగా మార్చుతున్నదని బీజేపీ విమర్శించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని విపక్ష పార్టీలకు పిలుపునిచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

