Jagadguru | తొలిసారి ‘జగద్గురు’గా దళితుడు.. మహేంద్రానందగిరికి బిరుదు
Jagadguru | దేశంలోనే తొలిసారిగా షెడ్యూల్డ్ కులానికి చెందిన స్వామీజీ ‘జగద్గురు’ బిరుదు పొందారు. దేశంలోని 13 అఖాడాల్లో ఒకటైన జునా అఖాడా.. మహామండలేశ్వర్ మహేంద్రానందగిరికి ఈ బిరుదును ప్రదానం చేసింది. మహేంద్రానంద శిష్యుడు కైలాశానందగిరికి మహామండలేశ్వర్, రాంగిరికి శ్రీమహంత్ బిరుదు ప్రదానం చేసింది.
- మహామండలేశ్వర్ మహేంద్రానందగిరికి ప్రదానం చేసిన జునా అఖాడా
ప్రయాగ్‌రాజ్, ఏప్రిల్ 30: దేశంలోనే తొలిసారిగా షెడ్యూల్డ్ కులానికి చెందిన స్వామీజీ ‘జగద్గురు’ బిరుదు పొందారు. దేశంలోని 13 అఖాడాల్లో ఒకటైన జునా అఖాడా.. మహామండలేశ్వర్ మహేంద్రానందగిరికి ఈ బిరుదును ప్రదానం చేసింది. మహేంద్రానంద శిష్యుడు కైలాశానందగిరికి మహామండలేశ్వర్, రాంగిరికి శ్రీమహంత్ బిరుదు ప్రదానం చేసింది. వీరిద్దరూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారే కావడం గమనార్హం. ప్రయాగ్‌రాజ్ జునా అఖాడాలోని సిద్దబాబా మౌజిగిరి ఆశ్రమంలో సోమవారం వీరు వేదమంత్రోచ్చారణల మధ్య బిరుదులు స్వీకరించారు. ముగ్గురు స్వామీజీలు గుజరాత్‌కు చెందినవారు కాగా స్వామి మహేంద్రానంద సౌరాష్ట్ర రాజ్‌కోట్ జిల్లాలోని బానాల గ్రామానికి చెందినవారు.
కాశీ సుమేరు పీఠాధీశ్వర్ జగద్గురువు, జునా అఖాడా అంతర్జాతీయ అధ్యక్షుడు స్వామి నరేంద్రానంద సరస్వతితోపాటు శ్రీమహంత్ ప్రేమ్‌గిరి, శ్రీదుధేశ్వర పీఠాధీశ్వర్, జునా అఖాడా, అంతర్జాతీయ అధికార ప్రతినిధి శ్రీమహంత్ నారాయణగిరి, మహామండలేశ్వర్ వైభవ్ తదితరులు బిరుదులు అందుకున్న వారిని పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమం సందర్భంగా మహేంద్రానంద, కైలాశలనందను సింహాసనంపై కూర్చోబెట్టి ఛత్రాలు బహూకరించారు. ఈ సందర్భంగా శ్రీమహంత్ ప్రేమ్‌గిరి మాట్లాడుతూ సన్యాసి సంప్రదాయంలో పాతుకుపోయిన కుల, వర్గ వివక్షను నిర్మూలించేందుకు జునా అఖాడా పనిచేస్తున్నట్టు చెప్పారు. మహాకుంభ్-2025కు ముందు ఈ దిశగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ షెడ్యూల్డ్ కులాల వారికి జగద్గురు, మహామండలేశ్వర్, శ్రీమహంత్ వంటి ముఖ్యమైన బిరుదులను ప్రదానం చేస్తున్నట్టు చెప్పారు. జగద్గురు నరేంద్రానంద సరస్వతి మాట్లాడుతూ జునా అఖాడా నిర్ణయం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. 2021లో హరిద్వార్ కుంభమేళాలో జునా అఖాడా మహేంద్రానందకు మహామండలేశ్వర్ బిరుదును ప్రదానం చేసింది. కార్యక్రమంలో స్వామి నరేంద్రానంద సరస్వతి, తదితరులు మాట్లాడారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

