Goa | బీజేపీలో కొనసాగలేనంటూ గుడ్ బై చెప్పేసిన మాజీ సీఎం
Goa | గోవాలో బీజేపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. నిన్నటికి నిన్నే ఉత్పల్ పర్రీకర్ రాజీనామా చేసిన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మాజీ సీఎం,

Goa | గోవాలో బీజేపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. నిన్నటికి నిన్నే ఉత్పల్ పర్రీకర్ రాజీనామా చేసిన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మాజీ సీఎం, సీనియర్ నేత లక్ష్మికాంత్ పర్సేకర్ బీజేపీకి రాజీనామా చేశారు. ఇకపై పార్టీలో కొనసాగాలని అనుకోవడం లేదని, రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని ప్రకటించారు. రాజీనామా తదనంతరం ఏమిటన్నది తర్వాత ఆలోచించుకుంటానని పర్సేకర్ పేర్కొన్నారు.బీజేపీ ప్రకటించిన జాబితాలో లక్ష్మికాంత్ పర్సేకర్ పేరు లేదు. దీనిపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పాత తరం కార్యకర్తలను విస్మరిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. 2014 నుంచి 2017 వరకూ లక్ష్మికాంత్ పర్సేకర్ సీఎంగా బాధ్యలు చేపట్టారు. మనోహర్ పర్రీకర్ కేంద్ర మంత్రిగా వెళ్లిన తర్వాత పర్సేకర్ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. మొదటి జాబితాలో భాగంగా బీజేపీ 34 మంది లిస్టును ప్రకటించింది. మొత్తం 40 అసెంబ్లీ సీట్లు కాగా, మరో ఆరు సీట్లలో అభ్యర్థులను ప్రకటించాల్సి వుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchi Venkat | ‘ఆదర్శ కుటుంబం’లో ‘పర్ణశాల’ పాట వివాదం.. సినిమాను బతికించండంటూ నిర్మాత ఆవేదన
Filmmaker Sanjay Gupta | బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత!
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
Drinking Water | రాష్ట్రంలో మొదలైన తాగునీటి కష్టాలు.. ఈ దృశ్యాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

