Lashkar terrorist extradited | భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు.. ఉగ్రవాదిని రువాండా నుంచి రప్పించిన సీబీఐ
Lashkar terrorist extradited | భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదిని రువాండా నుంచి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రప్పించింది. రహస్య ఆపరేషన్‌లో భాగంగా కిగాలీలోని ఇంటర్‌పోల్ ఆ ఉగ్రవాదిని భారత్‌కు అప్పగించింది.
న్యూఢిల్లీ: భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదిని రువాండా నుంచి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రప్పించింది. (Lashkar terrorist extradited) రహస్య ఆపరేషన్‌లో భాగంగా కిగాలీలోని ఇంటర్‌పోల్ ఆ ఉగ్రవాదిని భారత్‌కు అప్పగించింది. పాకిస్థాన్‌లోని లష్కరే తోయిబా (ఎల్ఈటీ)తో సంబంధాలున్న ఉగ్రవాది సల్మాన్ రెహ్మాన్ ఖాన్ బెంగళూరులో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. మిలిటెంట్ మాడ్యూల్స్‌కు నిధులు, ఆయుధాల సరఫరాకు సహకరించాడు.
కాగా, గత ఏడాది బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో భారీగా ఆయుధాలను పోలీసులు గుర్తించారు. ఏడు పిస్టల్స్, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్లు, ఒక మ్యాగజైన్, 45 లైవ్ రౌండ్లు, నాలుగు వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. 2023 అక్టోబర్ 25న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఈ కేసు దర్యాప్తు స్వీకరించింది. సల్మాన్ రెహ్మాన్ ఖాన్ కీలకమైన నిందితుడిగా గుర్తించింది.
మరోవైపు సీబీఐ అభ్యర్థన మేరకు ఈ ఏడాది ఆగస్టు 2న ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు జారీ చేసింది. దీంతో నిఘా సమాచారం ద్వారా సల్మాన్ రెహ్మాన్ ఖాన్ రువాండాలో ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ బృందం ఆ దేశానికి వెళ్లింది. దర్యాప్తు కోసం అతడ్ని భారత్‌కు తీసుకువచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ ఇంగ్లిష్ వెర్షన్లో 25 నిమిషాలు కట్.. ప్రపంచ ప్రీమియర్‌లో ఆసక్తికర విషయం!
ముద్దం జోగయ్య గౌడ్‌కు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
మేడి అఖిల్ హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్
Sabitha Indrareddy | పాలన గాలికొదిలేసి తిరుగుతున్న రేవంత్ రెడ్డి.. మూసీ అంత అర్జెంట్ ఏముంది.. : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
‘గర్భిణులకు ఇబ్బంది కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

