Nirmala Sitharaman: కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలి: కేంద్ర మంత్రి సీతారామన్
Nirmala Sitharaman: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి జరిగిన ఘటనలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు. మాలివాల్‌పై దాడికి పాల్పడిన వ్యక్తి బిభవ్ కుమార్‌తోనే సిగ్గులేకుండా కేజ్రీవాల్ తిరుగుతున్నట్లు మంత్రి ఆరోపించారు.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి జరిగిన ఘటనలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) డిమాండ్ చేశారు. ఇవాళ ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మాలివాల్‌పై దాడికి పాల్పడిన వ్యక్తి బిభవ్ కుమార్‌తోనే సిగ్గులేకుండా కేజ్రీవాల్ తిరుగుతున్నట్లు మంత్రి ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీర్ ఈ అంశంపై పెదవి విప్పాలన్నారు. ఆయన క్షమాపణలు చెప్పాలని కోరారు. మహిళలకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నట్లు ఆమె ఆరోపించారు.మాలివాల్‌పై దాడి చేసిన నిందితుడు బిభవ్ కుమార్‌పై చర్యలు తీసుకుంటాని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. కానీ మరుసటి రోజే లక్నోలో జరిగిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్‌తో బిభవ్ కనిపించడం ఆందోళనకరంగా ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. సీఎం నివాసంలో కేజ్రీవాల్ వ్యక్తిగత సిబ్బంది తనపై దాడి చేసినట్లు మాలివాల్ ఆరోపించిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

