మతమార్పిడి నిరోధక బిల్లుపై కర్నాటక కసరత్తు

బెంగళూర్ : మతమార్పిడి నిరోధక బిల్లును తీసుకువచ్చేందుకు కసరత్తు సాగిస్తున్నామని కర్ణాటక హోంమంత్రి అరగ జ్ణానేంద్ర మంగళవారం వెల్లడించారు. ఈ తరహా చట్టాన్ని తీసుకువచ్చిన ఇతర రాష్ట్రాల్లో చట్ట నిబంధనలను పరిశీలించి బిల్లును ప్రవేశపెడతామని ఆయన చెప్పారు. కర్ణాటకలో మతమార్పిడులు ముమ్మరంగా సాగుతున్నాయని, తన తల్లి మతం మారి క్రైస్తవం స్వీకరించిందని ఎమ్మెల్యే గూలిహట్టి శేఖర్ పేర్కొన్న క్రమంలో మత మార్పిళ్లను నిలువరించేందుకు చట్టం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి తెలిపారు.
కాగా, తన తల్లికి కొందరు నూరిపోసి క్రైస్తవంలోకి మార్పించారని ఎమ్మెల్యే శేఖర్ చెప్పుకొచ్చారు. హోసదుర్గ నియోజకవర్గంలో క్రైస్తవ మిషనరీలు పెద్ద ఎత్తున మతమార్పిళ్లకు పాల్పడుతున్నాయని, దాదాపు 18,000 నుంచి 20,000 మంది వరకూ హిందువులను మిషనరీలు క్రైస్తవ మతంలోకి చేర్పించాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తన తల్లి మతం మారేలా చేసిన మిషనరీలు ఆమెను నుదుటిపై కుంకుమ పెట్టుకోవద్దని కోరాయని చెప్పారు.
ఆమె ఫోన్ రింగ్‌టోన్‌ను కూడా క్రైస్తవ ప్రార్ధనలతో మార్చేశారని అన్నారు. ఇంట్లో పూజ చేయాలన్నా ఇబ్బందికరంగా ఉందని, తల్లికి ఏదైనా చెప్పినా ఆమె తనువు చాలిస్తానని అంటోదని ఆయన వాపోయారు. రాష్ట్రంలో జరుగుతున్న మత మార్పిళ్లపై మాజీ స్పీకర్ కేజీ బోపయ్య, ఎమ్మెల్యే దేవానంద్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

