DK Shivakumar | కన్నడ యువతకు ఉద్యోగాలివ్వకపోతే చర్యలు కఠినంగుంటాయ్ : డీకే శివకుమార్
DK Shivakumar | కర్ణాటక (Karnataka) కేంద్రంగా పనిచేసే ప్రైవేటు సంస్థలు (Private Companies) ముఖ్యంగా ఐటీ కంపెనీల (IT Companies) యాజమాన్యాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నియామక ప్రక్రియలో కన్నడిగులను ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నట్లు తేలితే ఆయా సంస్థలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
DK Shivakumar : కర్ణాటక (Karnataka) కేంద్రంగా పనిచేసే ప్రైవేటు సంస్థలు (Private Companies) ముఖ్యంగా ఐటీ కంపెనీల (IT Companies) యాజమాన్యాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నియామక ప్రక్రియలో కన్నడిగులను ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నట్లు తేలితే ఆయా సంస్థలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానికుల హక్కులు, గౌరవం, ఉద్యోగ అవకాశాలను నిర్లక్ష్యం చేయడాన్ని ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని అన్నారు.
బెంగళూరులోని ఐటీ కంపెనీల్లో కన్నడిగులకు ఉద్యోగాలు నిరాకరిస్తున్నారని తమకు ఫిర్యాదులు వచ్చాయని, వీటిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని డీకే ఎక్స్‌లో పోస్టు చేశారు. కన్నడ ప్రజల హక్కులు, గౌరవానికి ఇబ్బంది కలిగించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం అనుమతించబోదని చెప్పారు. కన్నడిగుల ప్రతిభ, నైపుణ్యాలు, సామర్థ్యాలను చూసి రాష్ట్రం గర్విస్తోందని అన్నారు. ఏదైనా ప్రైవేటు సంస్థ వారిని ఉద్దేశపూర్వకంగా పక్కనపెడితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు.
కన్నడిగులకు ఉద్యోగాల అంశంపై సోషల్ మీడియాలో ఇటీవల వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా రెజ్యూమెలో భాష స్థానంలో కన్నడ అని ప్రస్తావించినందుకు తన దరఖాస్తును తిరస్కరించారని చెబుతూ ఓ మహిళ సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేశారు. ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కూడా ట్యాగ్ చేశారు. ఇదే తరహా ఫిర్యాదులు ఇటీవల ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే సీఎం తీవ్రస్థాయిలో స్పందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | కన్నడ యువతకు ఉద్యోగాలివ్వకపోతే చర్యలు కఠినంగుంటాయ్ : డీకే శివకుమార్
Gummadi Narsaiah | కరువుపై ప్రకటనలేనా.. సహాయక చర్యలేవీ? : గుమ్మడి నర్సయ్య
Road accident | కొల్లూర్ ఓఆర్ఆర్ పైన ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Kerala woman | తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకు.. 13 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీ, పిల్లలు
DDLJ Movie | షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కానుక.. థియేటర్లలోకి ‘డిడిఎల్జె’ రీ-రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

