కంగన చెంప చెళ్లు
మండి నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనౌ రనౌత్‌ను సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంప దెబ్బ కొట్టారు. గురువారం చండీగఢ్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
- రైతుల ఆందోళనను అవమానించినందుకు కొట్టిన మహిళా కానిస్టేబుల్
- చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో కొట్టిన మహిళా కానిస్టేబుల్
- గతంలో రైతుల ధర్నాను అవమానించిందుకే కొట్టా: నిందితురాలు
- పంజాబ్‌లో ఉగ్రవాదం పెరిగింది: కొత్త ఎంపీ
చండీగఢ్: మండి నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనౌ రనౌత్‌ను సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంప దెబ్బ కొట్టారు. గురువారం చండీగఢ్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రత తనిఖీల సమయంలో నిందితురాలు కుల్విందర్ కౌర్ ఈ ఘటనకు పాల్పడ్డారు. ఢిల్లీ చేరుకున్న తర్వాత కంగన ఎక్స్‌లో స్పందిస్తూ… ‘పంజాబ్‌లో ఉగ్రవాదం, హింస పెరిగిపోతుండటంపై షాక్‌కు గురయ్యాను.
నన్నెందుకు కొట్టావని ఆమెను అడిగినప్పుడు.. రైతుల నిరసనకు మద్దతు ఇస్తున్నట్టు ఆమె నాకు చెప్పారు’ అని కంగన అన్నారు. కానిస్టేబుల్ తనను కొట్టిన తర్వాత దూషించిందన్నారు. ఘటనపై కుల్విందర్ కౌర్ కూడా స్పందించారు. ‘రైతులు రూ.100 కోసం ధర్నాలో కూర్చొంటున్నారని ఆమె(కంగన) గతంలో కామెంట్ చేశారు. నా తల్లి రైతుల ధర్నాలో పాల్గొన్నప్పుడు కంగన ఈ మాటలన్నారు’ అని ఆమె అన్నారు. నిందితురాలిని సస్పెండ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

