Champai Soren | వారంలో రోజుల్లో కొత్త పార్టీ.. కలిసి వచ్చే వారితో పొత్తు: చంపై సోరెన్
Champai Soren | వారం రోజుల్లో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ తెలిపారు. అలాగే కలిసి వచ్చే వారితో పొత్తు పెట్టుకుంటానని చెప్పారు. తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళిక గురించి చంపై సోరెన్ బుధవారం స్పష్టత ఇచ్చారు.
రాంచీ: వారం రోజుల్లో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ (Champai Soren) తెలిపారు. అలాగే కలిసి వచ్చే వారితో పొత్తు పెట్టుకుంటానని చెప్పారు. ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్లిన ఆయన బీజేపీలో చేరుతారంటూ ఊహాగానాలు వచ్చాయి. అయితే తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళిక గురించి చంపై సోరెన్ బుధవారం స్పష్టత ఇచ్చారు. కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ‘మూడు అవకాశాల గురించి నేను ప్రస్తావించా. పదవీ విరమణ, కొత్త పార్టీ లేదా వేరే పార్టీలో చేరిక. నేను పదవీ విరమణ చేయను. కొత్త పార్టీని బలోపేతం చేస్తా. మంచి స్నేహితుడిని కలిస్తే వారితో కలిసి ముందుకు సాగుతా’ అని అన్నారు.
కాగా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్త పార్టీని స్థాపించడానికి ఎక్కువ సమయం లేదన్న మీడియా ప్రశ్నకు చంపై సోరెన్ సమాధానం ఇచ్చారు. అది మీ సమస్య కాదని అన్నారు. ‘ఒక రోజులో 30,000 నుంచి 40,000 మంది కార్యకర్తలు చేరుకోగలరు. కొత్త (రాజకీయ) పార్టీని ఏర్పాటు చేయడంలో నాకు ఏ సమస్య ఉంటుంది. వారంలోగా పార్టీని ఏర్పాటు చేస్తా’ అని అన్నారు.
మరోవైపు తన రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం అంకితం చేసిన జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) లో తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నానని చంపై సోరెన్ ఆరోపించారు. సీఎంగా తన ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను తనకు చెప్పకుండా రద్దు చేయడం చాలా అంసతృప్తిని కలిగించిందని చెప్పారు. తనకు అధికారంపై అత్యాశ లేదని, అందుకే ఆత్మగౌరవం దెబ్బతినే వరకు మౌనంగా ఉన్నానని అన్నారు. అయితే చాలా అవమానాల తరువాత ప్రత్యామ్నాయ మార్గం కోసం వెతకవలసి వచ్చిందని తెలిపారు. ‘ఈ రోజు నుంచి నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది’ అని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

