Jawed Habib | మహిళ జుట్టుపై ఉమ్మి వేసిన ఘటన.. కమిషన్ ముందు తప్పు ఒప్పుకున్న జావెద్
Jawed Habib | ఓ మహిళ జుట్టుపై ఉమ్మి వేసిన ఘటనలో ప్రముఖ హెయిర్ స్టైలర్ జావేద్ హబీబ్ మంగళవారం జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు.

Jawed Habib | ఓ మహిళ జుట్టుపై ఉమ్మి వేసిన ఘటనలో ప్రముఖ హెయిర్ స్టైలర్ జావేద్ హబీబ్ మంగళవారం జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. మహిళ జుట్టుపై ఉమ్మి వేసిన వీడియో సోషల్ మీడియా వైరల్ కావడతో జాతీయ మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన కమిషన్ ముందు హాజరయ్యారు. మరోసారి ఇలాంటి తప్పును పునరావృత్తం కానివ్వనని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు. తానెవ్వర్నీ కించపరచాలని అలా చేయలేదని కూడా కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు.
యూపీలోని ముజఫర్ నగర్లో జరిగిన ఓ సెమినార్లో ప్రముఖ హెయిర్ స్టైలిషర్ జావెద్ హబీబ్ ఓ మహిళకు కేశాలంకరణ చేస్తున్నారు. ఈ సమయంలో ఆమె జుట్టుపై హబీబ్ ఉమ్మి వేశాడు. నీటిని వేస్తే జుట్టును అందుకోవడం కష్టమని, ఉమ్మి వేస్తే జుట్టును అందుకోవడం తేలిక అని విచిత్ర సమాధానం చెప్పాడు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. సభ్య సమాజం ఈ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వీడియో జాతీయ మహిళా కమిషన్ దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఆయనకు నోటీసులు జారీ చేసింది. వివాదం ముదరడంతో తాను చేసిన పనికి జావెద్ హబీబ్ క్షమాపణలు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

