జీఎస్ఎల్వీ-ఎఫ్ 18 ప్రయోగం విజయవంతం
భారత తదుపరి నావిగేషన్ ఉపగ్రహం ఎన్వీఎస్-03ని మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ రాకెట్ శుక్రవారం అర్ధరాత్రి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.
- కక్ష్యలోకి ఎన్వీఎస్-03
- నావిగేషన్ వ్యవస్థ బలోపేతానికి తోడ్పాటు
శ్రీహరికోట : భారత తదుపరి నావిగేషన్ ఉపగ్రహం ఎన్వీఎస్-03ని మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ రాకెట్ శుక్రవారం అర్ధరాత్రి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. అర్ధరాత్రి 11:51 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం(ఎస్డీఎస్సీ-షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ రోదసిలోకి దూసుకెళ్లింది. 50 మీటర్ల ఎత్తు, మూడు దశలు కలిగిన ఈ రాకెట్ ప్రయోగ సమయంలో 420 టన్నుల బరువు ఉంది.
ఇది 2,232 కిలోల బరువున్న ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని జియో సింక్రోసిస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్(జీటీవో)లో ప్రవేశపెట్టింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ ‘నావిక్’ ను మరింత బలోపేతం చేయడంలో ఎన్వీఎస్-03 కీలక పాత్ర పోషించనుంది. ఈ ఉపగ్రహంలో స్వదేశీ, విదేశీ అణు గడియారాలు కూడా ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

