నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ52 రాకెట్
ISRO | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన పీఎస్ఎల్వీ–సీ52 రాకెట్ నింగిలోకి దూసుకెళ్తున్నది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లాంచ్ ప్యాడ్ నుంచి
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన పీఎస్ఎల్వీ–సీ52 రాకెట్ నింగిలోకి దూసుకెళ్తున్నది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లాంచ్ ప్యాడ్ నుంచి దీనిని ప్రయోగించారు. 25 గంటలపాటు కౌంట్‌డౌన్ ముగించుకుని సోమవారం ఉదయం 5.59 గంటలకు ప్రయోగించిన రాకెట్ నింగిలో లక్ష్యందిశగా వెళ్తున్నది. ఇది మూడు ఉపగ్రహాలను రోదసీలోకి తీసుకెళ్తున్నది. ఇస్రో ఈ ఏడాదిలో చేపడుతున్న మొదటి ప్రయోగం ఇదే కావడం గమనార్హం.
#WATCH | Indian Space Research Organisation launches PSLV-C52/EOS-04 from Satish Dhawan Space Centre, Sriharikota
(Source: ISRO) pic.twitter.com/g92XSaHP9r
— ANI (@ANI) February 14, 2022
పీఎస్ఎల్వీ–సీ52 రాకెట్ 1710 కిలోల ఆర్బిట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఈఓఎస్–04, 17.50 కిలోల ఐఎన్ఎస్-2డీటీ, 8.10 కిలోల బరువున్న ఇన్‌స్పైర్‌శాట్-1, ఉపగ్రహాలను మోసుకెళ్తున్నది. ఈఓఎస్ అనేది రాడార్ ఇమేజింగ్ శాటిలైట్. దీన్ని వ్యవసాయం, అటవీ సంరక్షణ, నేల తేమ, హైడ్రాలజీ, వరదల మ్యాపింగ్‌కు సంబంధించి అన్ని వాతావరణ పరిస్థితుల్లో హైక్వాలిటీ ఫొటోలను అందించేలా రూపొందించారు. ఐఎన్ఎస్-2డీ ఉపగ్రహాన్ని భారత్, భూటాన్ సంయుక్తంగా రూపొందించాయి. దీనిని భవిష్యత్తు సైన్సు, ప్రయోగాత్మక పేలోడ్స్ కోసం రూపొందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- ISRO
- PSLV C52
- Sriharikota
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

