ల్యాప్‌టాప్‌లు లాగాఫ్.. ఐడీలు డీయాక్టివేట్
‘ఒకరి తర్వాత ఒకరు, మేమంతా మా అధికారిక పరికరాల యాక్సెస్ కోల్పోయాం. ల్యాప్‌టాప్‌లను లాగ్ ఆఫ్ చేశారు, అధికారిక ఐడీలను డీయాక్టివేట్ చేశారు’... సోమవారం పని చేస్తుండగా ఢిల్లీలోని ఓ ఇంజినీర్‌కు హఠాత్తుగా ఎదురైన ఉద్యోగ తొలగింపు అనుభవం ఇది.
- లంచ్ టైమ్‌లో ఇన్నోడాటా లేఆఫ్‌లు
- భారత్‌లో 500 మంది తొలగింపు
- ఆందోళనలో బాధిత ఉద్యోగులు
న్యూఢిల్లీ : ‘ఒకరి తర్వాత ఒకరు, మేమంతా మా అధికారిక పరికరాల యాక్సెస్ కోల్పోయాం. ల్యాప్‌టాప్‌లను లాగ్ ఆఫ్ చేశారు, అధికారిక ఐడీలను డీయాక్టివేట్ చేశారు’… సోమవారం పని చేస్తుండగా ఢిల్లీలోని ఓ ఇంజినీర్‌కు హఠాత్తుగా ఎదురైన ఉద్యోగ తొలగింపు అనుభవం ఇది. వాళ్లంతా ఇన్నోడాటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులని.. సుమారు 550 మంది ఉద్యోగులు ఇలా తొలగించబడ్డారని ఇండియా టుడే పేర్కొన్నది. ఫిలిప్పీన్స్‌లో కూడా ఆ కంపెనీ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించినట్టు వార్తలు వచ్చాయి. మధ్యాహ్నం సమయంలో ఉద్యోగులు తమ కంపెనీ సిస్టమ్స్ యాక్సెస్‌ను కోల్పోయారు.
ఆ తర్వాత వారిని ఉద్యోగం నుంచి తొలగించినట్టు వ్యక్తిగత ఈ-మెయిల్ అకౌంట్లకు ఈ-మెయిల్ వచ్చింది. వ్యాపార అవసరాల దృష్ట్యా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు.. తొలగింపులకు వ్యక్తిగత పనితీరుతో సంబంధం అందులో పేర్కొన్నారు. హఠాత్తుగా ఉద్యోగాలను తొలగించడంతో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. అమెరికా కేంద్రంగా పనిచేసే ఇన్నోడాటా సాంకేతిక సంస్థలకు డాటా ఇంజినీరింగ్, కృత్రిమ మేధ సేవలను అందిస్తుంది. టెక్నాలజీ కంపెనీలు తమ వ్యాపార ప్రాధాన్యతలను, సిబ్బంది అవసరాలను పునః సమీక్షిస్తున్న వేళ ఇన్నోడాటా ఈ కొలువుల కోతలు చేపట్టింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

