నెలాఖరుకు తగ్గుముఖం
- మరో రెండు వేవ్‌లు రావొచ్చు
- కానీ ఇంత తీవ్రత ఉండదు
- వ్యాక్సినాలజిస్టు గగన్‌దీప్ కాంగ్

న్యూఢిల్లీ, మే 6: దేశంలో కరోనా ఉద్ధృతి ఈ నెలాఖరుకల్లా తగ్గుముఖం పట్టొచ్చని ప్రముఖ వ్యాక్సినాలజిస్టు గగన్‌దీప్ కాంగ్ అన్నారు. తర్వాత మరో ఒకటి లేదా రెండు సార్లు కరోనా వేవ్ రావొచ్చని అయితే అవి ఇప్పుడున్నంత ప్రమాదకరంగా ఉండవవని ఆమె పేర్కొన్నారు. ఇండియన్ వుమెన్ ప్రెస్ కార్ప్స్ నిర్వహించిన వెబినార్‌లో ఆమె మాట్లాడారు. మొదటి వేవ్‌లో వైరస్ వ్యాపించని గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా ఇప్పుడు వైరస్ విస్తరించిందని అందుకే కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని చెప్పారు. ‘ప్రస్తుతం వైరస్ గురించి ఉన్న సమాచారాన్ని బట్టి దాని వ్యాప్తిని 14 రోజుల వరకు మాత్రమే అంచనా వేయగలం. రాబోయే 3 నెలల్లో ఎలా ఉంటుంది, 6 నెలల్లో ఎలా ఉంటుంది అన్న విషయాలు చెప్పలేం’ అని ఆమె వ్యాఖ్యానించారు. కొవిడ్ నుంచి కోలుకొంటున్నవారిలో ఇమ్యూనిటీ పెరుగుతున్నదని, అయితే వైరస్ జన్యుక్రమం మార్చుకొంటున్న కారణంగా అది సరిపోదని చెప్పారు. ఇమ్యూనిటీ మరింత బలపడటానికి టీకా వేసుకోవాలని సూచించారు. టీకాలపై భయం అక్కర్లేదని, సమర్థంగా పనిచేస్తున్నాయని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Graduate MLC Elections | పట్టభద్రుల ఓట్లతో కాంగ్రెస్‌లో గుబులు.. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో భారీగా పెరిగిన ఓట్లు!
Hyderabad CP | కొత్త సీపీ రాకతో పోలీసుల్లో గుబులు.. ఎవరుంటారో.. ఎవరు పోతారో!
Monthly Income Plans | నెలనెలా ఆదాయం కావాలా? మీ డబ్బుకు భరోసా ఇచ్చే టాప్ పెట్టుబడి పథకాలు ఇవే!
Municipal Elections | మున్సి‘పోల్’కు కాంగ్రెస్ వణుకు.. 5 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ఎప్పుడో?
Government Orders | అనాలోచితంగా జీవోలు.. ఆపై యూటర్న్లు.. బోరుబావుల తవ్వకాలకు కొత్త వెసులుబాటు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

