తౌటే తుఫాన్ ఎఫెక్ట్: 273 మందితో కొట్టుకుపోయిన నౌక!
Ship adrift: బలమైన గాలుల ధాటికి ముంబై పశ్చిమ తీరంలో ఓ వ్యాపార నౌక కొట్టుకుపోయింది.

ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుఫాన్ అతి తీవ్ర తుఫాన్‌గా మారింది. ఈ తుఫాన్ ధాటికి మహారాష్ట్ర, గోవా, గుజరాత్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి. ప్రస్తుతం తౌటే తుఫాన్ పశ్చిమ వాయవ్యం దిశగా గంటకు 20 కి.మీల వేగంతో పయనిస్తున్నది. ఈ రాత్రికి గుజరాత్‌లోని పోరుబందర్- మహువా మధ్య ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ తెలిపింది.
తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులతోపాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఎగిసిపడుతున్నాయి. బలమైన గాలుల ధాటికి ముంబై పశ్చిమ తీరంలో ఓ వ్యాపార నౌక కొట్టుకుపోయింది. ఆ నౌకలో 273 మంది ఉన్నట్లు సమాచారం. దాంతో కొట్టుకుపోయిన నౌక కోసం ఇండియన నేవీ గాలింపు చర్యలు చేపట్టింది. ఐఎన్ఎస్ కొచ్చి యుద్ధనౌక సాయంతో గాలింపు కొనసాగిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

