ఇంఫాల్, నవంబర్ 19: ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గగనతలంలో యూఎఫ్‌వో(అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్టెక్ట్(గుర్తుతెలియని ఎగిరే వస్తువు)) కలకలం రేపింది. దీంతో ఇంఫాల్ నుంచి వెళ్లాల్సిన కొన్ని విమానాలను రద్దు చేయగా, ఇంఫాల్‌కు వచ్చే వాటిని దారి మళ్లించారు. శాంతి భద్రతల సమస్య కారణంగా రాష్ట్రంలో ఇంటర్నెట్ నిషేధాన్ని ఈ నెల 23 వరకు పొడిగించారు. ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే యూఎఫ్‌వో కలకలం రేపడం గమనార్హం.