ఈ నెల 10న నామినేషన్ వేస్తా: మమతాబెనర్జి
Mamata Banerjee: భవానీపూర్ ఉపఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా తాను ఈ నెల 10 నామినేషన్ దాఖలు చేస్తానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ప్రకటించారు

కోల్‌కతా: భవానీపూర్ ఉపఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా తాను ఈ నెల 10 నామినేషన్ దాఖలు చేస్తానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ప్రకటించారు. ఏడాది ఆరంభంలో పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎలా జరిగాయో కేవలం ఆ భగవంతుడికి మాత్రమే తెలుసని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల సందర్భంగా చేసిన కుట్రలు అన్నీఇన్నీ కావని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారన్నారు. పైగా ఇప్పుడు తప్పు తమపై మోపుతూ అబద్దాలు చెబుతున్నాని ఆరోపించారు.
అప్పుడు ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ అధికారంలోకి రాలేకపోయిందని, ఇప్పుడు ఉప ఎన్నికల్లో కూడా వాళ్లు గెలిచే అవకాశం లేదని మమతాబెనర్జి ధీమా వ్యక్తంచేశారు. అప్పట్లో నందిగ్రామ్‌లో తనపై జరిగిన దాడిలో కూడా బీజేపీ కుట్ర ఉన్నదని ఆమె ఆరోపించారు. బయటి నుంచి వచ్చిన దాదాపు 1000 మంది బీజేపీ గూండాలు బెంగాల్ గురించి తప్పుడు ప్రచారం చేశారని ఆమె మండిపడ్డారు. రాజకీయంగా పోరాడే సత్తా లేకనే వాళ్లు విపక్షాలపై దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నారని విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

