Shashi Tharoor | ‘నన్నడిగితే ఎలా.. నేనేం ట్రావెల్ ఏజంట్‌ను కాదు’.. రాహుల్‌గాంధీ ఫారిన్ టూర్‌పై శశిథరూర్..!
Shashi Tharoor | కాంగ్రెస్ పార్టీ (Congress Party) అగ్రనేత (Congress Top leader), లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) విదేశీ పర్యటనపై మీడియా అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీకే చెందిన సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) ఆసక్తికరంగా స్పందించారు. ఆయన పర్యటన గురించి తనను ప్రశ్నించడంలో అర్థం లేదని, తానేమే ట్రావెల్ ఏజంట్ (Travel Agent) ను కాదని థరూర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీ (Congress Party) అగ్రనేత (Congress Top leader), లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) విదేశీ పర్యటనపై మీడియా అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీకే చెందిన సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) ఆసక్తికరంగా స్పందించారు. ఆయన పర్యటన గురించి తనను ప్రశ్నించడంలో అర్థం లేదని, తానేమే ట్రావెల్ ఏజంట్ (Travel Agent) ను కాదని థరూర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
ఇవాళ తిరువనంతపురంలో శశిథరూర్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘నేను ట్రావెల్ ఏజెంట్‌ను కాదు. ఆ ప్రశ్న నన్ను అడగటంలో అర్థం లేదు. నేను ఢిల్లీ వదిలి ఇక్కడికి ఎందుకు వచ్చాను..? ప్రతి వ్యక్తికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. కాబట్టి నేను ఆ విషయంపై వ్యాఖ్యానించలేను’ అని అన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు, సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో విపక్షాలు ఆందోళనలు చేస్తున్న సమయంలో రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లడంపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.
రాహుల్ వియత్నాం వెళ్తున్న విమానంలో ఉన్నారంటూ ఒక వీడియోను బీజేపీ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. నిరసనలతో బాగా అలసిపోయినందువల్లే ఆయనకు విశ్రాంతి అవసరమైందని బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ ఎద్దేవాచేశారు. అయితే రాహుల్ గాంధీ పర్యటనను కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ సమర్థించారు. ప్రధాని సహా ఇతర నేతలు విదేశాలకు వెళ్లడం లేదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని నిలదీశారు. విదేశాల్లో రాహుల్ విద్యార్థులతో, మేధావులతో సమావేశమవుతారని, ఇంటర్వ్యూలు ఇస్తారని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor | ‘నన్నడిగితే ఎలా.. నేనేం ట్రావెల్ ఏజంట్‌ను కాదు’.. రాహుల్‌గాంధీ ఫారిన్ టూర్‌పై శశిథరూర్..!
అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి
Obesity | 2050 నాటికి ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరికి ఊబకాయం.. చర్యలు తప్పనిసరి అంటున్న సంస్థలు..
Car Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు
Road Accident | స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీ కొట్టిన కారు..ఆరుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

