Air India | పండుగ పూట ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్.. దీపావళికి ఇంటికి వద్దామనుకుంటే విమానం రద్దు
పండుగ పూట ప్రయాణికులకు దేశీయ విమానాయన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) షాకిచ్చింది. కుటుంబ సభ్యులతో దీపావళి (Diwali) వేడుకల్లో పాల్గొందామనుకున్న ప్రవాస భారతీయులకు నిరాశ మిగిల్చింది. సాంకేతిక కారణాలతో చివరి క్షణంలో విమానానాన్ని రద్దు (Flight Cancel) చేసింది.
మిలన్: పండుగ పూట ప్రయాణికులకు దేశీయ విమానాయన సంస్థ ఎయిర్ ఇండియా (Air India) షాకిచ్చింది. కుటుంబ సభ్యులతో దీపావళి (Diwali) వేడుకల్లో పాల్గొందామనుకున్న ప్రవాస భారతీయులకు నిరాశ మిగిల్చింది. సాంకేతిక కారణాలతో చివరి క్షణంలో విమానానాన్ని రద్దు (Flight Cancel) చేసింది. దీపావళి పండుగకు ఇటలీలో ఉంటున్న వందలాది మంది భారతదేశానికి వద్దామనకున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు చెందిన మిలన్ నుంచి ఢిల్లీ వెల్లాల్సిన ఏఐ138 విమానంలో టికెట్లు బుక్‌చేసుకున్నారు. అయితే శుక్రవారం (అక్టోబర్ 17న) మిలాన్ నుంచి బయల్దేరాల్సిన విమానం సాంకేతిక కారణాలతో రద్దయిందని సంస్థ ప్రకటించింది. తదుపరి విమానం సోమవారం(దీపావళి) లేదా మంగళవారం బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా చెప్పడంతో వారంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు.
‘ఎయిర్ ఇండియా.. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యతనిస్తుందని, షెడ్యూల్ చేసిన విమానంలో సాంకేతిక సమస్య కారణంగా కారణంగా.. 2025, అక్టోబర్ 17న మిలన్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఏఐ 138 విమానం రద్దు అయ్యింది’ అని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఈ విమానంలో ఎక్కాల్సిన ప్రయాణికులకు హోటల్ వసతి కల్పించామని, విమానాశ్రయం సమీపంలోనే వారికి ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఎయిర్ ఇండియాతో పాటు ఇతర విమానయాన సంస్థలతో సీట్ల లభ్యత ఆధారంగా 2025, అక్టోబర్ 20 లేదా ఆ తర్వాత ప్రత్యామ్నాయ విమానాలలో ప్రయాణికులు తిరిగి టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఇక్కడ చిక్కుకుపోయిన ప్రయాణికులందరికీ భోజనంతో సహా అవసరమైన అన్ని సహాయాలను ఎయిర్ ఇండియా అందిస్తుంది. వారికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ప్రయాణికులు, సిబ్బంది భద్రతపై ఎయిర్ ఇండియా నిబద్ధత కలిగివుంటుందని పునరుద్ఘాటిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Comrade Kalyan | 21 రోజుల్లోనే ఓటీటీలోకి ‘కామ్రేడ్ కళ్యాణ్’.. ఎలాంటి ప్రకటన లేకుండా స్ట్రీమింగ్ ప్రారంభం!
Prasidh Krishna: కివీస్‌తో వన్డేలకు ప్రసిద్ధ కృష్ణ దూరం.. ఇండియా-ఏ జట్టులోకి సిరాజ్
Mirzapur: The Movie | ఓటీటీలోకి వచ్చేసిన ‘మీర్జాపూర్: ది మూవీ’.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ షురూ!
Delhi Traders: 12వేల కోట్ల వ్యాపారంపై ప్రభావం.. ర్యాలీని వాయిదా వేయండి.. సోనియా గాంధీని కోరిన ఢిల్లీ వ్యాపారులు
Vijay | సీఎం విజయ్ మానవత్వం.. సైగలతో ఉద్యోగం అడిగిన దివ్యాంగుడికి 24 గంటల్లోనే నియామక పత్రం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

