కాంగ్రెస్ పార్టీకి హార్దిక్ పటేల్ రాజీనామా
అహ్మాదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీకి భారీ జలక్ తగిలింది. హార్దిక్ పటేల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట కారణంగా ఆయన ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్న విషయాన్ని ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో వెల్లడించారు. గుజరాతీ ప్రజలు తన నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తాను వేయబోయే అడుగు భవిష్యత్తులో గుజరాతీలకు పాజిటివ్‌గా పనిచేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశౄరు.రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. పట్టేదార్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పటేల్ 2019లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుజరాత్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అధికంగా ఉన్నట్లు చాన్నాళ్ల నుంచి హార్దిక్ ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు.
आज मैं हिम्मत करके कांग्रेस पार्टी के पद और पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा देता हूँ। मुझे विश्वास है कि मेरे इस निर्णय का स्वागत मेरा हर साथी और गुजरात की जनता करेगी। मैं मानता हूं कि मेरे इस कदम के बाद मैं भविष्य में गुजरात के लिए सच में सकारात्मक रूप से कार्य कर पाऊँगा। pic.twitter.com/MG32gjrMiY
— Hardik Patel (@HardikPatel_) May 18, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

