నా టామీని కుక్క అంటారా.. ఎదురింటి వారిపై కర్రలతో దాడి..!
Man attack on neighbour: కుక్కను కుక్క అని సంబోధించినందుకు ఎదురింటి వాళ్లపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు

గురుగ్రామ్: కుక్కను కుక్క అని సంబోధించినందుకు ఎదురింటి వాళ్లపై దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు ఆ కుక్క యజమానులు. కుక్కను కుక్క అంటే తప్పేంటి అని ప్రశ్నించగా మళ్లీ దాడికి పాల్పడ్డారు ఆ ప్రబుద్ధులు. హర్యానాలోని గురుగ్రామ్ పట్టణంలో గత శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. గురుగ్రామ్ సైబర్సిటీలోని జ్యోతి పార్క్ ఏరియాలో సుధీర్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. వారి ఎదురింట్లో టామీ అనే ఒక పెంపుడు కుక్క ఉన్నది. ఆ కుక్క తరచూ దారివెంట వెళ్లేవాళ్ల వెంటపడుతున్నది. అంతేగాక సుధీర్ పిల్లలు ఆడుకోవడానికి ఇంటి ముందుకు వచ్చినా ఆ కుక్క వారిని భయపెడుతున్నది.
శుక్రవారం కూడా అలాగే జరుగడంతో సుధీర్ ఎదిరింటి వాళ్లను పిలిచి కుక్కను గొలుసు పెట్టి కట్టేయండి, పిల్లలను భయపెడుతున్నది అని చెప్పాడు. దాంతో ఆగ్రహానికి లోనైన కుక్క యజమాని నా టామీని కుక్క అంటావా అంటూ గొడవకు దిగాడు. కుక్కను కుక్క అంటే తప్పేంటి అని ప్రశ్నించడంతో దాడికి పాల్పడ్డాడు. సుధీర్ కుటుంబసభ్యులు అడ్డుకోవడంతో వాళ్లపైనా దాడి చేశాడు. అంతలోనే అతని కుటుంబసభ్యులు కూడా వచ్చి సుధీర్ కుంటుంబంపై మూకుమ్మడి దాడి చేశారు.
కాగా, ఈ ఘటనపై బాధితుడు సుధీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రధాని నిందితుడు అయిన కుక్క యజమానిని అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

