గవర్నర్ సర్.. మీరు రాష్ట్రపతి కాదు
Murasoli | నీట్ బిల్లు విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. బిల్లును రెండోసారి కూడా గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకపోవడంతో ప్రభుత్వం భగ్గుమన్నది. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న రాజ్‌భవన్‌ను తాము బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా అధికార డీఎంకేకి చెందిన మురసోలి పత్రిక గవర్నర్ తీరుపై విరుచుకుపడింది.
చెన్నై: నీట్ బిల్లు విషయంలో తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. బిల్లును రెండోసారి కూడా గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకపోవడంతో ప్రభుత్వం భగ్గుమన్నది. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న రాజ్‌భవన్‌ను తాము బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా అధికార డీఎంకేకి చెందిన మురసోలి పత్రిక గవర్నర్ తీరుపై విరుచుకుపడింది. గవర్నర్ సర్.. మీరు రాష్ట్రపతి కాదు. ప్రభుత్వం రూపొందించిన బిల్లులకు ఆమోదం తెలపడం మీ కర్తవ్యం. రాజ్యాంగం ప్రకారం సక్రమంగా విధులు నిర్వహించాలని తన సంపాదకీయంలో రాసుకొచ్చింది.

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలంటూ గతేడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం బిల్లును ఆమోదించి గవర్నర్‌కు పంపించింది. అయితే దీనిపై ఎటూ తేల్చకుండా గవర్నర్ తాత్సారం చేశారు. విమర్శలు రావడంతో చివరకు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్నదంటూ ఆ బిల్లును అసెంబ్లీ పరిశీలనకు ఈ నెల 3న గవర్నర్ తిరిగి పంపారు. దీంతో ఫిబ్రవరి 8న మరోసారి రెండో బిల్లును అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ ఆమోదానికి పంపారు. అయితే దీనిని కూడా గవర్నర్ రవి పక్కన పెట్టారు.
దీంతో విద్యార్థుల ప్రయోజనాలను పట్టించుకోకుండా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. బిల్లును ఆమోదించేవరకు రాజ్‌భవన్‌కు తాము దూరంగా ఉంటామని ప్రకటించింది. ఈ క్రమంలో రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమాన్ని కూడా బహిష్కరించింది.
ఈ నేపథ్యంలో శనివారం మురసోలి పత్రికలో గవర్నర్ వ్యవహార శైలిపై ఎడిటోరియల్ ప్రచురించింది. గవర్నర్ తీరు చూస్తుంటే తాను రాష్ట్రపతిగా భావిస్తున్నారని విమర్శించింది. తమిళనాడు అసెంబ్లీ పాస్ చేసిన బిల్లును ఆమోదించి, దానిని రాష్ట్రపతికి పంపించడం గవర్నర్ విధి. అయితే దానిని నిర్వర్తించడంలో విఫలమయ్యారు. ఆర్ఎన్ రవిని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నది. అసలు నీట్ బిల్లును ప్రభుత్వం ఎందుకు తీసుకురావల్సి వచ్చిందనే విషయాలను కూడా ఆ వ్యాసంలో వివరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

