‘ఉచితాల’ బీజేపీ
గురివింద నీతిని తలపిస్తున్నది బీజేపీ వైఖరి. ఉచిత హామీలు ఇవ్వరాదని, తాము ఉచితాలకు వ్యతిరేకమని నిత్యం నీతిసూక్తులు వల్లించే బీజేపీ నేతలు.. గుజరాత్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇబ్బడిముబ్బడిగా ఉచిత హామీలు కురిపించారు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): గురివింద నీతిని తలపిస్తున్నది బీజేపీ వైఖరి. ఉచిత హామీలు ఇవ్వరాదని, తాము ఉచితాలకు వ్యతిరేకమని నిత్యం నీతిసూక్తులు వల్లించే బీజేపీ నేతలు.. గుజరాత్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఇబ్బడిముబ్బడిగా ఉచిత హామీలు కురిపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో ప్రజలకు పెద్ద ఎత్తున ఉచిత హామీలు ప్రకటించారు. శనివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేశారు.
మ్యానిఫెస్టోలోని ఉచితాలు
- కాలేజీ విద్యార్థినులకు ఉచిత ఎలక్ట్రిక్ స్కూటర్లు
- 9-12 తరగతి స్కూల్ విద్యార్థినులకు ఉచిత సైకిళ్లు, ఉచిత శానిటరీ నాప్కిన్స్
- ఏడాదికి ఉచితంగా 2 ఎల్పీజీ సిలిండర్లు
- మహిళలు, వృద్ధులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం
- బాలికలకు కేజీ టు పీజీ ఉచిత విద్య
- రూ.110 కోట్లతో సీఎం ఫ్రీ డయాగ్నస్టిక్ స్కీమ్
- సబ్సిడీపై నెలకు ఒక లీటర్ వంటనూనె, 1 కిలో శనగలు మ్యానిఫెస్టోలోని ఇతర ముఖ్య హామీలు తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న రూ.5 భోజనంతో పాటు 2036లో ఒలింపిక్ గేమ్స్ కోసం ‘గుజరాత్ ఒలింపిక్స్ మిషన్’ ప్రారంభిస్తామని బీజేపీ హామీలు ఇచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

