Tamilnadu Assembly: తమిళనాడు అసెంబ్లీలో టీవీకే బలపరీక్ష.. తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం విజయ్
Tamilnadu Assembly: తమిళనాడు సీఎం విజయ్ విశ్వాస పరీక్ష ఎదుర్కొంటున్నారు. బలపరీక్షకు చెందిన తీర్మానాన్ని ఆయన ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అనేక పార్టీలు ఆయనకు మద్దతు ప్రకటించాయి. బీజేపీ ఎమ్మెల్యే తటస్థంగా ఉన్నారు. అన్నాడీఎంకే పళనిస్వామి వర్గం వ్యతిరేకంగా ఉంది.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ(Tamilnadu Assembly)లో సీఎం విజయ్ బలపరీక్ష ఎదుర్కొంటున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజారిటీ రాకపోవడంతో.. గవర్నర్ అర్లేకర్ ఆదేశాల ప్రకారం ఇవాళ ఆయన పార్టీ బలపరీక్షకు సిద్దమైంది. విశ్వాస పరీక్షకు చెందిన తీర్మానాన్ని ఇవాళ అసెంబ్లీలో సీఎం విజయ్ ప్రవేశపెట్టారు. తమిళిగ వెట్రి కజగం పార్టీకి ఆయన మద్దతు కోరారు. విశ్వాసపరీక్ష ప్రక్రియలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ తన మద్దతును టీవీకే పార్టీకి ప్రకటించింది. సీపీఎం పార్టీ కూడా విజయ్‌కే మద్దతు తెలిపింది. విశ్వాస పరీక్ష సమయంలో వీసీకే కూడా తన సపోర్టు టీవీకేకే అని వెల్లడించింది. అధికారంలో ఉన్న టీవీకేకే తమ మద్దతు ఉంటుందని ఐయూఎంఎల్ కూడా చెప్పింది.
అయితే టీవీకే పార్టీకి వీసీకే ఓ విన్నపం చేసింది. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఓ చట్టాన్ని తేవాలని ఆ పార్టీ కోరింది. మహారాష్ట్ర, కర్నాటక తరహాలో ఆ చట్టం ఉండాలని ఆ పార్టీ కోరింది. అన్నాడీఎంకేకు చెందిన పళనిస్వామి వర్గం .. టీవీకేకు వ్యతిరేకంగా ఉన్నది. కానీ షణ్ముగం వర్గం మాత్రం విజయ్‌కే మద్దతు పలికింది.
ఓఎస్డీగా రాధన్ పండిట్‌ను నియమించడాన్ని దేశీయ మురుపొక్కు ద్రావిడ కజగం పార్టీ వ్యతిరేకించింది. విశ్వాస పరీక్ష సమయంలో ఎమ్మెల్యే ప్రేమలతా విజయ్‌కాంత్ మాట్లాడారు. ప్రఖ్యాత జ్యోతిష్కుడు రికీ పండిట్ వెట్రివేల్‌ను రాధన్ పండిట్‌గా పిలుస్తారు. అయితే సీఎం విజయ్ ఓఎస్డీగా రాధన్‌ను నియమించడాన్ని ప్రేమలత తప్పుపట్టారు. మీరు ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారని ఆమె ప్రశ్నించారు.
విశ్వాస పరీక్షకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఎంజేకే పార్టీ తెలిపింది. ప్రభుత్వంలో ఓ జ్యోతిష్కుడు ఉండరాదని ఆ పార్టీ అభిప్రాయపడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patnam Narender Reddy | అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ కుటుంబంపై తిట్ల రాజకీయాలు : మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
‘‘ప్రజా గర్జన – ఛలో హైదరాబాద్’ ని జయప్రదదం చేయండి’
‘ఆదివాసీ యువకుడు తెల్లం శరత్ మృతి ఘటనపై సమగ్ర విచారణ జరపాలి’
ACB Net | రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వార్డు ఆఫీసర్
‘పున్న కైలాష్ బహిరంగ క్షమాపణ చెప్పాలి’
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

