Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Divya Mittal: మాజీ ఐఏఎస్ ఆఫీసర్ దివ్యా మిట్టల్ తన రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. జన నీతి భారత్ అని పేరు పెట్టారు. 2027లో యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనున్నట్లు దివ్యా మిట్టల్ తెలిపారు. ఐఏఎస్ గా ఆమె స్వచ్ఛంధ పదవీవిరమణ తీసుకున్న విషయం తెలిసిందే.
లక్నో: మాజీ ఐఏఎస్ ఆఫీసర్ దివ్యా మిట్టల్(Divya Mittal) తన రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. జన నీతి భారత్ అని పేరు పెట్టారు. ఐఏఎస్ గా ఆమె స్వచ్ఛంధ పదవీవిరమణ తీసుకున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనున్నట్లు దివ్యా మిట్టల్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆమె తన ఎక్స్ అకౌంట్లో ఓ వీడియోను పోస్టు చేశారు. విధాన రూపకల్పనలో ప్రజలను కేంద్రబిందువుగా మార్చనున్నట్లు ఆమె తెలిపారు. అయిదేళ్ల సమయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించేలా చేయనున్నట్లు చెప్పారు. జన నీతి పార్టీలో మీరే పాలిస్తారని ఆమె అన్నారు.
ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగుళూరు, వాల్ స్ట్రీట్ ట్రేడర్ అయిన దివ్యా మిట్టల్.. సుమారు 13 ఏళ్ల పాటు ఐఏఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆగస్టు 30వ తేదీన ఆమె తన పదవికి రాజీనామా చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆమె సెప్టెంబర్ 29వ తేదీన ప్రకటించారు. కొత్త పార్టీ ఏర్పాటు గురించి ఆమె చెబుతూ.. దేశంలో రాజకీయ పార్టీల కొరత ఏమీ లేదని, కానీ ప్రజా సమస్యలను ఆలకించే పార్టీలు లేవని, కొన్ని పార్టీలు కొందర్ని మాత్రమే వింటున్నాయని ఆమె అన్నారు. జన నీతి భారత్ ప్రతినిధులు మాత్రం ప్రజలకు జవాబుదారులుగా ఉంటారన్నారు.
జన నీతి భారత్ వద్ద ప్రకటనల కోసం పెద్దగా డబ్బులు లేవని, కానీ ఇంటింటి ప్రచారంతో రంగంలోకి దిగనున్నట్లు ఆమె తెలిపారు. రాజకీయాలు కాదు, జన నీతి అన్న నినాదాన్ని ఆమె వినిపించారు. రాజీనామా చేస్తున్నసమయంలో ఆమె లక్నో రెవన్యూ శాఖలో స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు.
मेरा राजनीतिक सफर का अगला कदम। मेरे साथ जुड़ें 🙏🙏 https://t.co/c9ihA3dxOB
— Divya Mittal (@divyamittal_IAS) October 15, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Divya Mittal: జన నీతి భారత్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్టల్
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

