సెలవు లేకుండా 27 ఏండ్లుగా విధులు
మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా? అయితే సెలవు తీసుకోకుండా ఎన్ని రోజులుగా పని చేస్తున్నారు? వారం? నెల? సంవత్సరం?. సంవత్సరం పాటు ఎవరైనా పని చేస్తారా? అని అనుకుంటున్నారా.
- జాక్‌పాట్ కొట్టిన ఉద్యోగి
- రూ.3.26 కోట్ల బహుమానం
లాస్‌వెగాస్, మే 6: మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా? అయితే సెలవు తీసుకోకుండా ఎన్ని రోజులుగా పని చేస్తున్నారు? వారం? నెల? సంవత్సరం?. సంవత్సరం పాటు ఎవరైనా పని చేస్తారా? అని అనుకుంటున్నారా. అమెరికాలోని లాస్‌వెగాస్‌కు చెందిన ఓ వ్యక్తి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 27 ఏండ్లు సెలవే తీసుకోకుండా విధులు నిర్వర్తించారు. నిర్విరామంగా కంపెనీకి సేవలు చేసినందుకు గానూ అతను జాక్‌పాట్ కొట్టారు. లాస్‌వెగాస్‌లోని బర్గర్‌కింగ్ కంపెనీలో కెవిన్ ఫోర్డ్ ఉద్యోగి. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పదవీ విరమణ వరకు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. ఒంటరి తండ్రిగా తన కుమార్తెలను చదివించుకుంటూనే రోజూ విధులకు హాజరయ్యారు. అందుకు ప్రతిఫలంగా కంపెనీ అతనికి రూ.3.26 కోట్ల బహుమానం అందించింది. బహుమానం అందుకున్న బ్యాగును తెరుస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయగా వైరల్‌గా మారింది. కెవిన్ కుమార్తె సెరినా ఫండ్ రైజింగ్‌ను ప్రారంభించారు. గోఫండ్‌మీ ఆధ్వర్యంలో సహోద్యోగులు, కంపెనీ, డేవిడ్ స్పేడ్ లాంటి సెలబ్రిటీలు ఇందులో పాల్గొన్నారు. భారీ మొత్తాన్ని సేకరించి కెవిన్‌కు బహుమానంగా అందించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’కి చిక్కులు.. నేతాజీ చరిత్రను వక్రీకరించారంటూ దర్శకుడిపై విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

