Watch: మాక్ డ్రిల్‌లో గన్ ఎక్కుపెట్టిన ‘ఉగ్రవాది’.. చెంప చెళ్లుమనిపించిన వ్యక్తి
Man Slaps Armed Terrorist | ప్రముఖ ఆలయంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాది మాదిరిగా ఉన్న పోలీస్ ఒక వ్యక్తి తలకు గన్ ఎక్కుపెట్టాడు. ఇది చూసి కొందరు వ్యక్తులు, పిల్లలు భయాందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి నేరుగా ‘ఉగ్రవాది’ వద్దకు వెళ్లాడు. ఆ వేషంలో ఉన్న పోలీస్ చెంప చెళ్లుమనిపించాడు.
ముంబై: ప్రముఖ ఆలయంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాది మాదిరిగా ఉన్న పోలీస్ ఒక వ్యక్తి తలకు గన్ ఎక్కుపెట్టాడు. ఇది చూసి కొందరు వ్యక్తులు, పిల్లలు భయాందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి నేరుగా ‘ఉగ్రవాది’ వద్దకు వెళ్లాడు. ఆ వేషంలో ఉన్న పోలీస్ చెంప చెళ్లుమనిపించాడు (Man Slaps Armed Terrorist). ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దేవ్‌పూర్ ప్రాంతంలోని స్వామినారాయణ ఆలయంలో పోలీసులు మంగళవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. కొందరు పోలీసులు ఉగ్రవాదుల మాదిరిగా భక్తులను భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నించారు. బంధీలుగా చేసుకున్న కొందరిపై తుపాకులు ఎక్కుపెట్టారు. ఇది చూసి గుడి ఆవరణలోని భక్తులు భయాందోళన చెందారు. కొందరు పిల్లలు ఏడ్చారు.
కాగా, తన కుమార్తె భయంతో ఏడ్వటంతో ఒక వ్యక్తి రగిలిపోయాడు. ఒక భక్తుడి తలపై గన్ ఎక్కుపెట్టిన ఉగ్రవాదిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అరుస్తూ ధైర్యంగా అతడి వద్దకు వెళ్లాడు. ఉగ్రవాది చేతిని మెలితిప్పడంతోపాటు అతడి చెంప చెళ్లుమనిపించాడు. ఇంతలో పోలీసులు అతడి వద్దకు వచ్చారు. అది మాక్ డ్రిల్ అని అతడికి నచ్చజెప్పారు. ఆ వ్యక్తిని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లారు. ఉగ్రవాదిగా భావించి పోలీస్ చెంపపై కొట్టిన వ్యక్తిని 35 ఏండ్ల ప్రశాంత్ కులకర్ణిగా గుర్తించారు.
మరోవైపు ఆ సమయంలో అక్కడున్న కొందరు తమ మొబైల్ ఫోన్లలో దీనిని రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేశారు.
महाराष्ट्र के धुले में एक मंदिर में चल रही थी पुलिस की मॉकड्रिल.
मॉकड्रिल देख वहा पर मौजूद छोटे बच्चे डर की वजह से रोने लगे.
इतने में बच्चो के परिवार में से एक आदमी ने मॉक ड्रिल के दौरान ही पुलिस को तप्पड़ जड़ दिया..#Maharashtra pic.twitter.com/hmjQIc3p30
— Vivek Gupta (@imvivekgupta) August 8, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

