చపాతి ఇవ్వలేదని రిక్షా కార్మికుడిని చంపిన మందుబాబు
Rickshaw puller | దేశ రాజధాని ఢిల్లీలో ఓ మందుబాబు దారుణానికి పాల్పడ్డాడు. తాను తినడానికి చపాతి ఇవ్వలేదని ఓ రిక్షాకార్మికుడిని చంపేశాడు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ మందుబాబు దారుణానికి పాల్పడ్డాడు. తాను తినడానికి చపాతి ఇవ్వలేదని ఓ రిక్షాకార్మికుడిని చంపేశాడు. ఈ నెల 26న రాత్రి 10 గంటల సమయంలో మున్నా (40) అనే రిక్షాకార్మికుడు మరో వ్యక్తితో కలిసి ఢిల్లీలోని కారోల్ బాఘ్‌లో చపాతీ తింటున్నాడు. ఇంతలో ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఫిరోజ్.. తనకు చపాతీ ఇవ్వాలని మున్నాను అడిగాడు.
దీంతో మున్నా అతడికి ఓ రొట్టె ఇచ్చాడు. మరో చపాతీ కావాలని అడగడంతో అతడు తిరస్కరించాడు. నాకే ఇవ్వవా అని ఆవేశంతో ఊగిపోయిన ఫిరోజ్.. తిట్ల దండకం మొదలు పెట్టాడు. అంతటితో ఆగకుండా మున్నాను కొట్టసాగాడు. రిక్షాకార్మికుడు ఎదురు తిరగడంతో కోపోద్రిక్తుడైన అతడు.. పదునైన కత్తితో మున్నా పొడిచి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే అక్కడే ఉన్న మరో వ్యక్తి ఫిరోజ్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అతడు దొరకకపోవడంతో.. రక్తపు మడుగులో ఉన్న మున్నాను స్థానికుల సహాయంతో దవాఖానకు తీసుకెళ్లాడు. అయితే అప్పటికే అతడు మృతిచెందాడని డాక్టర్లు నిర్ధారించారు.
ప్రత్యక్ష సాక్షి చెప్పిన వివరాల మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఢిల్లీలో గాలింపు చేపట్టి నిందితుడు ఫిరోజ్ ఖాన్‌ను పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదుచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

