హంగ్ అసెంబ్లీ వద్దు : కమల్‌హాసన్

కోయంబత్తూరు: మక్కల్ నీధి మయ్యిం చీఫ్ కమల్‌హాసన్ ఆదివారం ప్రచారంలో పాల్గొన్నారు. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు రాష్ట్రాన్ని ఏలేందుకు సమర్థులు కావన్నారు. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని, కానీ హంగ్ అసెంబ్లీని ఏర్పాటు చేయవద్దు అన్నారు. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలకు మద్దతు ఇవ్వలేమని, అందుకే ప్రజలు భారీ సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గోవాలన్నారు. పేద ప్రజల్లో అభ్యున్నతి తీసుకురావాలన్నదే తన కాంక్ష అని, రాజ్యాంగం ప్రకారం సేవ చేయడమే తన టార్గెట్ అన్నారు. గత సోమవారమే కమల్‌హాసన్ .. కోయంబత్తూరు నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. కోయంబత్తూరు తన గుండెకు ఎంతో దగ్గరగా ఉంటుందని, సిటీలో తనకు ఎంతో మంది మిత్రులు ఉన్నారని, ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని, ఇక్కడే తన జీవితంలో ఎన్నో కీలక సంఘటనలు చోటుచేసుకున్నట్లు కమల్ చెప్పారు. గాంధీజీపై ఓ కామెంట్ చేస్తూ.. గాంధీ ఓ గుజరాతీ మాత్రమే కాదు అని, ఆయన నాకు తండ్రి అని కమల్ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

