బెంగళూరు: కదులుతున్న కారుపై ఒక కుక్క ఉన్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ కుక్కను ప్రమాదంలో పడేసిన ఓనర్‌పై నెటిజన్లు మండిపడ్డారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఫర్ఎవర్ బెంగళూరు అనే ట్విట్టర్ యూజర్ ఒక వీడియో క్లిప్‌ను గురువారం పోస్ట్ చేశారు. ‘జస్ట్ బెంగళూరు థింగ్స్’ అని పేర్కొన్నారు. ఆ వీడియోలో కదులుతున్న కారుపై ఒక కుక్క ఉన్నది. తొలుత నిల్చొని ఉన్న బ్రౌన్ కలర్ కుక్క అనంతరం కదులుతున్న ఆ కారుపై కూర్చొంది. దాని మెడకు బెల్ట్ ఉండటంతో అది పెంపుడు కుక్కగా తెలుస్తున్నది.
కాగా, మరో కారులో ప్రయాణించిన వ్యక్తి తన మొబైల్ ఫోన్లో ఈ వీడియోను రికార్డ్ చేశాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు దీనిపై సీరియస్‌గా స్పందించారు. ఆ కుక్క, కారు యజమాని నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కుక్కను ప్రమాదంలో పడేయడంపై మండిపడ్డారు. మూగ జీవి అయినప్పటికీ దాని ప్రాణాలకు ముప్పు కలిగించడం తగదన్నారు. ఆ కుక్క యజమాని తన పిల్లలను ఇలాగే కారుపై ఉంచుతాడా? అని ప్రశ్నించారు. కొందరు ఈ వీడియో క్లిప్‌ను బెంగళూరు పోలీసులకు ట్యాగ్ చేశారు. ఆ కారు యజమానిని గుర్తించి అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Just Bengaluru things 🤣🤣🤣 pic.twitter.com/Taaf18tzoL
— Forever Bengaluru 💛❤️ (@ForeverBLRU) February 2, 2023