Demolition Notice: లక్నో కోచింగ్ సెంటర్ కూల్చివేతకు నోటీసులు
Demolition Notice: లక్నో కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో 15 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. అయితే ఆ 3 అంతస్తుల భవనాన్ని కూల్చివేసేందుకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. రెసిడెన్షియల్ బిల్డింగ్ పేరుతో కమర్షియల్ స్పేస్‌గా వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. 2016లో కూడా ఆ బిల్డింగ్‌కు నోటీసులు జారీ అయ్యాయి.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో 15 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. నగరంలోని అలీగంజ్ ఏరియాలో ఉన్న ఆ మూడు అంతస్తుల భవనాన్ని కూల్చివేసేందుకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ కూల్చివేత ఆదేశాలు(Demolition Notice) జారీ చేసింది. రెసిడెన్షియల్ బిల్డింగ్ పేరుతో ఉన్న ఆ భవనంలో కమర్షియల్ స్పేస్‌ను ఎలా నిర్మించాలని అధికారులు ఆరా తీస్తున్నారు. లక్నో మున్సిపల్ అధికారులపైన కూడా చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్మయ్యారు. వాస్తవానికి ఆ బిల్డింగ్‌ను కూల్చివేయాలని 2016లో ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేని నిర్మాణంగా భావిస్తూ ఆ ఆదేశాలు ఇచ్చారు. కానీ రెండు నెలల్లోనే మళ్లీ ఆ ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు.
అలీగంజ్ బిల్డింగ్ కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చినట్లు ఎల్డీఏ వైస్ చైర్మెన్ ప్రథమేశ్ కుమార్ తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం పట్ల దర్యాప్తు చేపట్టామని, త్వరలో చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఆ బిల్డింగ్‌లో ఉన్న యానిమేషన్ సెంటర్లో కోర్సులు నేర్చుకునేందుకు భారీ సంఖ్యలో విద్యార్థులు వస్తుంటారు. అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ప్రభుత్వ ఏర్పాటు చేసిన సిట్ బృందం ఇవాళ ఉదయం ఆ ప్రదేశానికి చేరుకున్నది.
సీఎం యోగి ఆదేశాల మేరకు సిట్ బృందం దర్యాప్తు చేపడుతోంది. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు చెందిన ఆరు మంది సిబ్బంది ఇవాళ ఆ బిల్డింగ్ వద్ద ఆధారాలు సేకరించారు. అగ్నిప్రమాదం దేని వల్ల జరిగిందో, బాధ్యులు ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

