Dengue death: ఢిల్లీలో తొలి డెంగీ మరణం
Dengue death: దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది తొలి డెంగీ మరణం నమోదైంది. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది తొలి డెంగీ మరణం నమోదైంది. దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీలో ఈ ఏడాది మొత్తం 720కి పైగా డెంగీ కేసులు నమోదు కాగా.. అందులో ఈ నెల 1వ తేదీ నుంచి 16వ తేదీ మధ్య నమోదైన కేసులే 382 ఉన్నాయని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ నెలలో కూడా ఢిల్లీలో మొత్తం 217 డెంగీ కేసులు నమోదయ్యాయి. గత మూడేండ్లలో సెప్టెంబర్ నెలలో నమోదైన డెంగీ కేసులతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువని ఢిల్లీ ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి.
గత ఏడాదిలో జనవరి నుంచి అక్టోబర్ వరకు మొత్తం 266 డెంగీ కేసులు నమోదయ్యాయి. అయితే ఏడాది చివరికల్లా ఆ సంఖ్య 1,072కు పెరిగింది. గత ఏడాది ఒకే ఒక్క డెంగీ మరణం చోటుచేసుకోగా.. ఈ ఏడాది ఇప్పటికే ఒకరు డెంగీతో ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభం కాగానే డెంగీ విజృంభిస్తున్నది. ఆ తర్వాత శీతాకాలంలో క్రమంగా తగ్గిపోతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- Dengue death
- SDMC
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

