కరోనా సోకిన వృద్ధుడ్ని.. ఒంటరిగా వదిలేసిన కుటుంబం

న్యూఢిల్లీ: కరోనా సోకిన వృద్ధుడ్ని ఒక కుటుంబం ఇంట్లో ఒంటరిగా వదిలేసింది. ఆయన కుమార్తె సమాచారంతో స్పందించిన పోలీసులు అతడ్ని కాపాడి ఆసుపత్రిలో చేర్చారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది. మురళీధర్ అనే 80 ఏండ్ల వ్యక్తి ఢిల్లీ పాత రాజేంద్రనగర్ ప్రాంతంలోని ఒక భవనంలో నివాసం ఉంటున్నారు. కరోనా సోకిందన్న భయంతో ఆయనను ఇంట్లో ఒంటరిగా వదిలేసి కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు.
మరోవైపు మురళీధర్‌కు చెందిన ఒక కుమార్తెకు ఈ విషయం తెలియడంతో పోలీసుల సహాయం కోరారు. దీంతో కానిస్టేబుల్ రాజు రామ్ ఆయన ఇంటికి వెళ్లారు. నేను చనిపోతే.. నా మృతదేహాన్ని పోలీసులకు అప్పగించండి అని డోర్ బయట ఉన్న పోస్టర్‌ను చూసి చలించిపోయారు. మురళీధర్‌ను కలిసి ఆయన గురించి ఆరా తీయగా మాజీ సీఐడీ అధికారి అని తెలిసింది. చివరకు ఆయనను ఒప్పించి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.
మురళీధర్‌కు ముగ్గురు కుమార్తెలని పోలీసులు తెలిపారు. ఒకరు విదేశాల్లో ఉండగా ఇద్దరు ఢిల్లీలో నివాసం ఉంటున్నారని చెప్పారు. ఆయనను ఒంటరిగా వదిలేసిన కుటుంబ సభ్యుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | చూపులతోనే కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న కృతి శెట్టి!
Keerthy Suresh | చీరకట్టులో కీర్తి సురేష్ అందాల విందు.. చూపులతోనే కుర్రాళ్లకు చెక్!
చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసుల దాడి.. 25 మంది విద్యార్థులు అదుపులోకి!
Mrunal Thakur | చీరకట్టులోనూ మత్తెక్కించే అందాలు.. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో అదుర్స్!
IND vs NZ | ఫిలిప్స్ విధ్వంసం.. భారత్‌కు 87 పరుగుల భారీ ఓటమి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

