Delhi MCD Polls | ఢిల్లీ మేయర్ పీఠం ఆప్ కైవసం.. బీజేపీకి ఘోర పరాభవం
Delhi MCD Polls | ఢిల్లీ మేయర్ పీఠాన్ని అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్‌లోని మొత్తం 250 వార్డులకుగాను ఆప్
న్యూఢిల్లీ: ఢిల్లీ మేయర్ పీఠాన్ని అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్‌లోని మొత్తం 250 వార్డులకుగాను ఆప్ 126 వార్డుల్లో గెలిచి మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. గత 15 ఏండ్లుగా ఢిల్లీ కార్పోరేషన్‌ను ఏలుతున్న బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. వరుసగా మూడు పర్యాయాలు మేయర్ పీఠం దక్కించుకున్న బీజేపీ.. ఇప్పుడు 97 వార్డుల్లో మాత్రమే విజయం సాధించింది.
ప్రస్తుతం ఆప్ మరో 8 వార్డుల్లో, బీజేపీ 6 వార్డుల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం ఏడు వార్డుల్లో మాత్రమే గెలిచి, మూడు వార్డుల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. స్వతంత్ర అభ్యర్థులు మూడు వార్డుల్లో విజయం సాధించారు. ఢిల్లీ నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపడాలంటే ఆప్‌ను గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో కేజ్రివాల్ ఓటర్లకు పిలుపునిచ్చారు.
ఢిల్లీలో తమ ప్రభుత్వమే ఉన్నా, ఢిల్లీ కార్పోరేషన్ బీజేపీ చేతిలో ఉండటంతో తమకు ఢిల్లీని క్లీన్ చేసే అవకాశం లేకుండా పోయిందని ఆయన ఢిల్లీ ఓటర్లకు వివరించారు. ఎప్పుడైనా ఢిల్లీ పీఠంపై ఒక పార్టీ ఉంటే, ఢిల్లీ మేయర్ పీఠంపై మరో పార్టీ ఉంటూ వస్తున్నాయని, దాంతో సమన్వయం కొరవడి పారిశుద్ధ్యం పడకేస్తున్నదని ఆయన చెప్పారు. ఈసారి పాత సంప్రదాయాన్ని తిరగరాసి ఢిల్లీ మేయర్ పీఠాన్ని కూడా ఆప్కే కట్టబెట్టాలని కోరారు. కేజ్రివాల్ కోరినట్టుగానే ఢిల్లీ ఓటర్లు ఇప్పుడు ఆప్‌కు అధికారం కట్టబెట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

