తౌటే తాకిడి తగ్గకముందే ముంచుకొస్తున్న యాస్ తుఫాన్..!
Yaas Cyclone: ఇప్పటికే అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుఫాన్ ధాటికి పశ్చిమతీరం అతలాకుతలం అయ్యింది. తౌటే ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గకముందే

న్యూఢిల్లీ: ఇప్పటికే అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుఫాన్ ధాటికి పశ్చిమతీరం అతలాకుతలం అయ్యింది. తౌటే ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గకముందే.. ఇప్పుడు తూర్పు తీరానికి మరో తుఫాన్ ముంచుకొస్తున్నది. ఈ నెల 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 25 కల్లా తీవ్ర తుఫాన్‌గా మారనుంది. ఈ రాబోయే తుఫాన్‌కు యాస్ అని పేరుపెట్టారు. ఈ యాస్ తుఫాన్ మే 26-27 తేదీల్లో తూర్పు తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన 72 గంటల్లో అది మరింత బలపడి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని, అది వాయువ్య దిశగా కదులుతూ మే 26 నాటికి పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల మధ్య తీరాన్ని తాకే అవకాశముందని ఐఎండీ తుపాను హెచ్చరికల విభాగం తెలిపింది. ఈ యాస్ తుఫాన్ ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవులు, ఒడిశా, బెంగాల్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

