మొసళ్లు మంచినీటిలో నివసిస్తాయి. సాధారణంగా నెమ్మదిగా కదులుతున్న నదులు, చిత్తడి నేలలు, సరస్సుల్లో ఉండేందుకు ఇష్టపడతాయి. అయితే, ఒక భారీ మొసలి నదిలోనుంచి ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోను ‘హెలికాప్టర్ యాత్ర’ అనే యూజర్ ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ వీడియోలో మొసలి పారే నదిలోంచి రోడ్డుపైకి వస్తుంది. అదృష్టవశాత్తు ఆ రోడ్డుపై ఒక బైక్ తప్ప మనుషులెవరూ లేరు. ఆ వెంటనే అది నీటిలో అదృశ్యమైపోయింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్కు గురయ్యారు. ఇప్పటివరకూ ఈ వీడియోను 2.9 మిలియన్ల మంది వీక్షించారు. లక్షా 29వేల లైకులు వచ్చాయి.