మాస్క్ సరిగా పెట్టుకోకుంటే.. విమానాశ్రయాల్లో భారీ జరిమానా

న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులకు ఇప్పటికే మాస్క్ నిబంధనలు అమలులో ఉన్న విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో ప్రయాణికులు మాస్క్ పెట్టుకోకున్నా.. సరిగా ధరించకపోయినా… అలాంటి ప్రయాణికులను విమానం నుంచి దించేయాలని ఇప్పటికే ఆదేశాలు అమలులో ఉన్నాయి. ఇప్పడు తాజాగా విమానాశ్రయ ఆపరేటర్లకు డీజీసీఏ కొత్త ఆదేశాలు జారీ చేసింది. విమానాశ్రయ పరిసరి ప్రదేశాల్లో ఎవరైనా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి వద్ద జరిమానా వసూల్ చేయాలని ఆదేశించింది. మాస్క్‌ను ధరిస్తున్న వారు తమ మూతిని, ముక్కును కవర్ చేసే విధంగా పెట్టుకోవాలి. అసంపూర్ణంగా మాస్క్‌ను ధరించినా జరిమానా తప్పదు. కోవిడ్ ఆంక్షలను పటిష్టంగా అమలు చేయాలంటే ఈ శిక్షలు తప్పవని డీజీసీఏ ఓ ప్రకటనలో అభిప్రాయపడింది.
మాస్క్‌లు పెట్టుకోమని ఎవరైనా ప్రయాణికుడు మొండికేసినా వారిని పోలీసులకు అప్పగించాలని గతంలోనే డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కొన్ని విమానాశ్రయాలపై నిఘా పెట్టామని, అక్కడ నిర్లక్ష్యం ఉన్నట్లు గ్రహించామని, అందుకే కోవిడ్ నిబంధనలు ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విమానాశ్రయ ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు డీజీసీఏ చెప్పింది. ఇప్పటికే కొన్ని ఎయిన్లైన్స్ సంస్థలు మాస్క్‌లు ధరించని ప్రయాణికులపై ఫైన్లు వసూల్ చేశాయి. గత వారం 15 మంది స్వదేశీ ప్రయాణికులపై నిషేధం కూడా విధించారు. డీజీసీఏ రూల్ ప్రకారం ఈ 15 మంది మూడు నెలల పాటు విమానా ప్రయాణానికి దూరం కానున్నారు. దీంట్లో ముగ్గుర్ని ముందే దించేయగా.. మరో 12 మందిని ల్యాండింగ్ సమయంలో పోలీసులకు అప్పగించారు. ఇండిగో సంస్థ 9 మంది ప్రయాణికులపై చర్యలు తీసుకున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Prints Fake Rs 500 Notes | ఇంటి అద్దె చెల్లించలేక.. నకిలీ రూ.500 నోట్లు ముద్రించిన వ్యక్తి
France Protests | ఫ్రాన్స్‌లో చెలరేగిన హింస.. 1000 మంది అరెస్ట్.. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్ల ప్రయోగం
AP News | రానున్న ఐదు రోజులు అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు ఏపీ హోంమంత్రి ఆదేశం..!
CULT Title | సూర్య సినిమా కోసం ‘కల్ట్’ టైటిల్ అడిగారు.. కానీ నేను ఇవ్వలేదు: విశ్వక్ సేన్
Rahul Gandhi | ‘మా ర్యాలీకి పబ్లిసిటీ చేస్తున్నందుకు థ్యాంక్స్’.. బీజేపీపై రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రాలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

