Shashi Tharoor | హోటల్ లిఫ్టులో చిక్కుకున్న ఎంపీ శశిథరూర్.. ఎక్స్‌లో స్పందన..!
Shashi Tharoor | ఓ ప్రైవేట్ హోటల్ లిఫ్ట్ (Private hotel lift) లో చిక్కుకున్న కాంగ్రెస్ ఎంపీ (Congress MP) శశిథరూర్ (Shashi Tharoor) సురక్షితంగా బయటపడ్డారు. రోటరీ క్లబ్ ఆఫ్ త్రివేండ్రం ఈస్ట్ (Rotary Club of Trivandrum East) కార్యక్రమానికి హాజరయ్యేందుకు థరూర్ శుక్రవారం సాయంత్రం ఓ హోటల్‌కు వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Shashi Tharoor : ఓ ప్రైవేట్ హోటల్ లిఫ్ట్ (Private hotel lift) లో చిక్కుకున్న కాంగ్రెస్ ఎంపీ (Congress MP) శశిథరూర్ (Shashi Tharoor) సురక్షితంగా బయటపడ్డారు. రోటరీ క్లబ్ ఆఫ్ త్రివేండ్రం ఈస్ట్ (Rotary Club of Trivandrum East) కార్యక్రమానికి హాజరయ్యేందుకు థరూర్ శుక్రవారం సాయంత్రం ఓ హోటల్‌కు వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు.
అప్పటికే హోటల్ సిబ్బంది ఇనుపరాడ్ల సాయంతో తలుపులు తెరవాలని యత్నించినా ఫలితం లేకపోయింది. అగ్నిమాపక సిబ్బంది హైడ్రాలిక్ స్ప్రెడర్ సాయంతో లిఫ్ట్ తలుపులను విడదీసి థరూర్‌తోపాటు అందులో ఉన్న మిగతా ఎనిమిది మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. బయటకు రాగానే థరూర్ చిరునవ్వుతో అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ‘మీరు అద్భుతంగా పనిచేశారు. అందరికీ ధన్యవాదాలు’ అని వారిని ప్రశంసించారు.
ఈ ఘటనపై థరూర్ ఎక్స్‌లో స్పందించారు. లిఫ్ట్‌లో అరగంటపాటు ఉండటం పెద్ద సమస్య కాదన్నారు. అయితే తన తర్వాతి రెండు సమావేశాలకు ఆలస్యమైందని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

