Abhijeet Dipke | కాక్రోచ్ జనతాపార్టీ చీఫ్ అభిజిత్ దీప్కేకు చెంపదెబ్బ.. చెంపదెబ్బ కొట్టిన వారిపై దాడి..!
Abhijeet Dipke | కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే (Abijit Dipke) పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అభిజిత్‌ను చెంపదెబ్బకొట్టారు. అపై తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అభిజిత్‌పై దాడి చేసిన వారిని పట్టుకుని కాక్రోచ్ కార్యకర్తలు చితక బాదారు.
Abhijeet Dipke : కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే (Abijit Dipke) పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అభిజిత్‌ను చెంపదెబ్బకొట్టారు. అపై తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అభిజిత్‌పై దాడి చేసిన వారిని పట్టుకుని కాక్రోచ్ కార్యకర్తలు చితక బాదారు. సీజేపీ ఆధ్వర్యంలో ఈ ఉదయం జైపూర్ (Jaipur) లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి జరగడంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
నీట్ పరీక్ష పత్రికా లీకేజ్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు జైపూర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే హాజరయ్యారు. దాంతో పార్టీ మద్దతుదారులు ఆయనను భూజాలపై ఎత్తుకొని ర్యాలీగా సభాస్థలి వద్దకు తీసుకెళుతుండగా ఊహించని పరిణామం జరిగింది. కొందరు ఆయన దగ్గరికి రాగా ఒకడు చెంపపై కొట్టాడు. దాంతో అక్కడే ఉన్న కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడిన వారిపై దాడిచేశారు.
కాగా, ఓ కేసులో భాగంగా దేశంలోని నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్నజీవులతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పోల్చారు. దాంతో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. సీజేపీ ప్రారంభమైన గంటల వ్యవధిలోనే కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇక నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే నాయకత్వంలో మొదటిసారి ఢిల్లీలో భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు చేపడుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
IND vs WI | టాస్ గెలిచిన వెస్టిండీస్.. ఆ 11 మందితోనే బరిలోకి టీమిండియా..!
‘పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి’
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
JNU professor | జేఎన్‌యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌ను డిస్మిస్ చేసిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

