బాలుడ్ని కాటేసిన పాము… అతడు కొరకడంతో పాము మృతి
దీపక్ చాలా భయాందోళన చెందాడు. పాము చుట్టుకున్న చేతిని గట్టిగా విదిలించాడు. ఆ పాము వీడక పోవడంతో తన నోటితో రెండు సార్లు ఆ పామును గట్టిగా కొరికాడు
రాయ్‌పూర్: ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న బాలుడ్ని పాము కరిచింది. అయితే చేతికి చుట్టుకున్న ఆ నాగు పామును విదిలించినా వీడకపోవడంతో ఆ బాలుడు దానిని గట్టిగా పలుమార్లు కొరికాడు. దీంతో ఆ పాము మరణించింది. ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్ జిల్లాలో ఈ వింత సంఘటన జరిగింది. ఎనిమిదేళ్ల దీపక్ తన ఇంటి వెనుక ఆడుకుంటున్నాడు. ఇంతలో ఒక నాగుపాము అతడి చేతికి చుట్టుకుని కాటేసింది. దీంతో దీపక్ చాలా భయాందోళన చెందాడు. పాము చుట్టుకున్న చేతిని గట్టిగా విదిలించాడు. ఆ పాము వీడక పోవడంతో తన నోటితో రెండు సార్లు ఆ పామును గట్టిగా కొరికాడు. దీంతో ఆ బాలుడి చేతి నుంచి వీడిన ఆ నాగుపాము చనిపోయింది.
అనంతరం పాము కాటువేసిన సంగతిని తన తల్లిదండ్రులకు దీపక్ చెప్పాడు. దీంతో వారు అతడ్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పాము కాటును పరిశీలించారు. పాము కాటు వేసినప్పటికీ విషం చిమ్మలేదని తెలిపారు. దీంతో ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. ముందు జాగ్రత్త కోసం ఆ బాలుడికి విషం విరుగుడు ఇంజక్షన్ ఇచ్చారు. ఒక రోజంతా పరిశీలనలో ఉంచిన తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

