Tamil Vetrikondan | ఆ ఎమ్మెల్యే కొడుకు పేరు టీవీకే..! నామకరణం చేసిన సీఎం విజయ్
Tamil Vetrikondan | టీవీకే చీఫ్(TVK), సీఎం జోసఫ్ విజయ్, టీవీకే ఎమ్మెల్యే ఎంఆర్ పల్లవికి పుట్టిన శిశువుకు అధికారికంగా ‘తమిళ్ వెట్రికొండన్’ అని నామకరణం చేశారు.
తమిళనాడు : టీవీకే చీఫ్(TVK), సీఎం జోసఫ్ విజయ్, టీవీకే ఎమ్మెల్యే ఎంఆర్ పల్లవికి పుట్టిన శిశువుకు అధికారికంగా ‘తమిళ్ వెట్రికొండన్’ అని నామకరణం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల మధ్య పండగ వాతావరణంలో సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఆ పసికందును ఆప్యాయంగా ఒడిలోకి తీసుకొని పేరు పెట్టి ముద్దు చేశారు. కాగా, ఎం.ఆర్. పల్లవి తిరు-వి-కా నగర్ నియోజకవర్గం నుంచి టీవీకే తరఫున తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
నిండు గర్భిణిగా ఉన్నప్పటికి ఇంటింటికి ప్రచారం చేసి ఆమె వార్తల్లో నిలిచారు. అయితే పల్లవి టీవీకే పార్టీ మొదటి అక్షరాలు కలిసొచ్చేలా బిడ్డకు పేరు పెట్టాలని బలంగా కోరుకున్నారు. ఇదే విషయాన్ని సీఎం విజయ్ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన సీఎం టీవీకే పార్టీ స్ఫురించేలా తమిళ్ వెట్రికొండన్ (TVK) అని పేరు పెట్టారు. అయితే ‘తమిళ వెట్రి కొండన్’ అనే పేరు విజయ్ నటించిన రాబోయే జననాయగన్ చిత్రంలో విజయ్ పాత్ర పేరు కావడం విశేషం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

